సినిమా రివ్యూ: ‘హిట్ 3’

- May 01, 2025 , by Maagulf
సినిమా రివ్యూ: ‘హిట్ 3’

హిట్ ఫ్రాంచైజీల్లో మూడోదిగా తెరకెక్కిన సినిమానే ‘హిట్ 3’. నేచురల్ స్టార్ నాని సొంత బ్యానర్‌లో రూపొందుతోన్న సినిమాలివి. ఈ సారి నానినే లీడ్ రోల్ పోషించాడు. అర్జున్ సర్కార్‌ అనే పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో నాని నటించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ బజ్ ఓ రేంజ్‌లో సంపాదించుకుంది. మరి, ఆ బజ్ రిలీజ్ తర్వాత దక్కించుకుందా.? లేదా.? తెలియాలంటే ‘హిట్ 3’ కథలోకి వెళ్లాల్సిందే.!

కథ:
అర్జున్ సర్కార్ (నాని) ఓ దయా దాక్షిణ్యాలు (రూత్‌లెస్) లేని పోలీసాఫీసర్. వందమంది నిందితులు తప్పించుకున్నా ఫర్వాలేదు కానీ, ఒక్క అమాయకుడికీ శిక్ష పడకూడదు అన్న న్యాయ స్థానం రూల్‌కి వ్యతిరేకంగా వంద మంది అమాయకులు ఇబ్బంది పడ్డా కాదు కాదు చచ్చిపోయినా.. ఒక్క క్రిమినల్ కూడా తప్పించుకోకూడదు అన్న సిద్ధాంతంతో వుంటాడు అర్జున్ సర్కార్. తన చేతికి చిక్కిన క్రిమినల్స్‌కి నరకం చూపిస్తుంటాడు. అలా ఓ సీరియల్ కిల్లర్ కేసు అర్జున్ సర్కార్ చేతికి చిక్కుతుంది. ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి, క్రిమినల్‌ని తనదైన స్టైల్‌లో విచారిస్తుంటాడు అర్జున్ సర్కార్. మరి, ఈ క్రమంలో బయటికొచ్చిన నిజాలేంటీ.? ఏ మోటోతో ఆ కిల్లర్ వరుస హత్యలు చేసుకుంటూ పోయాడు.? చివరికి ఆ క్రిమినల్‌కి అర్జున్ సర్కార్ విధించిన శిక్ష ఎలాంటిది.? ఇవన్నీ చాాలా క్యాజువల్ విషయాలే అయినా తెరపై ఒక్కొక్కటిగా ఈ సీన్లు చూస్తే వచ్చే కిక్కు నెక్స్‌ట్ లెవల్ వుండబ ోతోంది. ఆ కిక్కు ఆస్వాదించాలంటే, ‘హిట్ 3’ తెరపై చూడాల్సిందే.!

నటీనటుల పనితీరు:
నాని గురించి ప్రత్యేకంగా చెప్పడానికేముంది. అయితే, ఇంతవరకూ తనకున్న పక్కింటబ్బాయ్ ఇమేజ్‌కి భిన్నంగా వుంటుందీ ‘అర్జున్ సర్కార్’ పాత్ర. ఆ పాత్రలోనూ నాని చక్కగా ఒదిగిపోయాడు. తన క్యారెక్టర్‌పై తానే డైలాగులేసుకున్నాడు ఆడియన్స్‌ అభిప్రాయానికి కనెక్ట్ అయ్యేలా.విశ్వరూపం చూపించాడు. కొన్ని చోట్ల అయితే, ముఖ్యంగా క్లైమాక్స్ర‌ సీన్లలో మరీ భయపెట్టేశాడు వైలెంట్‌గా. ఇక హీరోయిన్‌గా శ్రీనిధి శెట్టి ‘కేజేీఎఫ్’తో తెచ్చుకున్న క్రేజ్.. అంతా ఇంతా కాదు. అంత క్రేజ్ వచ్చినా ఏ సినిమా పడితే ఆ సినిమా చేసేయలేదు. ఆచి తూచి సినిమాలు చేసింది. తెలుగులో శ్రీనిధి శెట్టి స్ట్రెయిట్‌గా చేసిన తొలి సినిమా ఇది. పాత్ర చిన్నదే అయినా ప్రాధాన్యత వున్న పాత్ర. కొన్ని యాక్షన్ ఘట్టాల్లోనూ కాన్ఫిడెంట్‌గా నటించింది. మాగంటి శ్రీనాధ్ తొలి రెండు సిరీస్‌ల్లో మాదిరి ఈ సిరీస్‌లోనూ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. రావు రమేష్ ఎప్పటిలాగే.. తన అనుభవంతో ఈజీగా నటించేశాడు. బ్రహ్మాజీ తదితరులు తమ తమ పాత్రల పరిధి మేర నటించి మెప్పించారు.

సాంకేతిక వర్గం పని తీరు:
శైలేష్ కొలను ‘హిట్’ సిరీస్‌ల కోసం రాసుకున్న కథలన్నీ కొత్తగానే వున్నాయ్. అలాగే ఈ సిరీస్ కోసం రాసుకున్న కథ కూడా.  మర్డర్ మిస్టరీనే.. ఈ మధ్య ఈ తరహా మర్డర్ మిస్టరీలు చాలానే చూసేశాం. కానీ, ఇందులో సమ్‌థింగ్ కొత్తదనం చూపించాలనుకున్నాడు డైరెక్టర్. నాని లాంటి హీరోతో చేయించిన ఒళ్లు గగుర్పొడిచే యాక్షన్ ఘట్టాలు, రక్తపాతం.. దీనికి పిల్లలకు ఎంట్రీ లేదని ముందే పక్కాగా చెప్పేశారు. ‘ఎ’ సర్టిఫికెట్‌కీ ముందే ప్రిపేర్ అయిపోయారు. పిల్లలే కాదు, కొన్ని కొన్ని సన్నివేశాల్లో పెద్దలే భయపడేంతలా రక్తపాతం చూపించాడు. హీరో క్యారెక్టరైజేషన్‌ని ఆ స్థాయిలో డిజైన్ చేశాడు. నాని ఆ పాత్రలో తనవంతు న్యాయం చేసేశాడు. నానిలోని డిఫరెంట్ యాంగిల్ ఇది. చిన్న పిల్ల ఎపిసోడ్ బాగుంది. సీరియస్‌గా సాగిపోతున్న స్క్రీన్‌ప్లేకి హీరో హీరోయిన్ లవ్ ట్రాక్ కొంత రీ ఫ్రెష్‌మెంట్ అనిపిస్తుంది.  సినిమాటోగ్రఫీ ఈ సినిమాకి ప్లస్ పాయింట్. జమ్మూ కాశ్మీర్, హిమాచల ప్రదేశ్, అరుణాచల ప్రదేశ్ తదితర ప్రదేశాల్లో లొకేషన్లు బాగా హైలైట్ చేశారు. మిక్కీ జె మేయర్ మ్యూజిక్ మరో అస్సెట్. ప్లెజెంట్‌గా వున్న పాటలతో పాటూ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా సన్నివేశాలకి తగ్గట్లుగా కొట్టాడు. ఎడిటింగ్ విషయంలో కాస్త కట్ చేసి వుంటే బాగుండనిపిస్తుంది. మరీ అంత దారుణంగా రక్తపాతం చూపించాల్సిన అవసరం లేదనిపిస్తుంది కానీ, హీరో క్యారెక్టర్‌కిచ్చిన ఇంట్రోతో అది ఓకే అనిపిస్తుంది. నిర్మాణ విలువలు సినిమాకి తగ్గట్లుగా వున్నాయ్. ఓవరాల్‌గా శైలేష్ కొలను తాను అనుకున్న కథని అనుకున్న విధంగా ఎస్టాబ్లిష్ చేయడంలో ఎలాంటి రాజీ పడలేదు. ఎక్కడా తడబడలేదు. భయపడలేదు.

ప్లస్ పాయింట్స్:
కథ, కథనం, నానిలోని కొత్త యాంగిల్.. అందుకు తగ్గట్లుగా పర్‌ఫామెన్స్.. విజువల్స్.. మ్యూజిక్..సెకండాఫ్‌లోని ట్విస్టులు, పరుగెత్తించే స్క్రీన్‌ప్లే..  మొదలైనవి..

మైనస్ పాయింట్స్:
భయంకరమైన రక్తపాతం, రూత్‌లెస్ అండ్ ఒళ్లు గగుర్పొడిచే సన్నివేశాలు,.   

ఫైనల్‌గా:
‘హిట్ 3’.! బాబోయ్ నాని...హిట్టు కొడతాడో లేదో తెలీదు కానీ, ఆ రక్తపాతంతో మాత్రం భయపెట్టేశాడు.! నానీ.! నువ్వు కూడానా.! అంటూ రక్తపాతం విషయంలో కామెంట్లు గట్టిగా వినిపిస్తున్నాయ్.

గల్ఫ్ డిస్ట్రిబ్యూటర్: Phars Film Co.LLC

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com