మే డే
- May 01, 2025
కార్మికోద్యమాల విజయానికి ప్రతీకగా మేడే లేదా అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం ప్రపంచమంతటా భాసిల్లుతూనే ఉంది. ఈ కార్మిక దినోత్సవం ఏ ఒక్క ప్రాంతానికో, దేశానికో, సంఘటనకో పరిమితం కాలేదు. శ్రమదోపిడిని(Exploitation) నిరసిస్తూ ప్రపంచవ్యాప్త కార్మికుల్లో స్పూర్తిని రగిలించిన తొలి అడుగే ‘మే డే’.
ప్రపంచ వ్యాప్తంగా మే 1వ తేదీని కార్మిక దినోత్సవంగా జరుపుకుంటారు. 1886 మే 4న షికాగోలోని హే మార్కెట్‌లో కార్మిక సంఘాల సభలో పోలీసు కాల్పులు జరిగాయి. ఆ ఘటనలో మరణించిన కార్మికుల బలిదానాన్ని స్మరిస్తూ వారి పోరాట పటిమకు ప్రతి ఏడాది మే 1న నివాళులర్పించాలని 1889లో అంతర్జాతీయ సోషలిస్టు సమాఖ్య నిర్ణయించింది. నాటి నుండి మే 1ని కార్మిక దినోత్సవంగా జరపడం ప్రారంభమయ్యింది. భారత ఉపఖండంలో తొలిసారిగా 1923 మే నెల మొదటి రోజున మద్రాస్‌లో అరుణ పతాకం రెపరెపలాడింది.
1980 తర్వాత చోటుచేసుకున్న ప్రైవేటైజేషన్, లిబరలైజేషన్, గ్లోబలైజేషన్ (ఎల్పీజీ) పరిణామాల వల్ల అసంఘటిత కార్మికవర్గాల కార్మిక చట్టాలు అమలుకు నోచుకోవడంలేదు.ఎంతో మంది శ్రామికుల చేతులు కలవకుండా ఏ పారిశ్రామికవేత్త విజయం సాధించలేడు. ప్రతి పారిశ్రామికవేత్త విజయం వెనుక వేల మంది ఉద్యోగులు/కార్మికుల కృషి ఉంటుంది. మే డే జరుపుకునేందుకు ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి. ఆ రోజున కార్మికులు వారి హక్కులను గుర్తు చేసుకోవడం, సమాజానికి వారు చేసిన సేవలకు గాను తగిన గుర్తింపు ఇచ్చి వారిని సన్మానించడం.
శ్రామికులు లేని దేశం.. దేశమే కాదు. శ్రామికులను తప్పకుండా గౌరవించుకోవాలి. వారిని అగౌరవపరచకూడదు. ఎందుకుంటే జీవితంలో మెట్టు ఎక్కేందుకు ఎందరో శ్రామికులు చేయి వేస్తారు. అప్పుడే ముందుకు సాగగలరు. అలాంటి వారిని తప్పుకుండా గౌరవించుకోవడం అందరి బాధ్యత !
--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- హమద్ పోర్టులో ఆడియో స్పీకర్లలో షాబు..!!
- అనుమతి లేకుండా వ్యక్తిగత డేటా బహిర్గతం..తీవ్రమైన నేరం..!!
- అబుదాబి-దుబాయ్ E11లో EV మెగాహబ్..!!
- 1,197 మంది ప్రవాసులను బహిష్కరించిన కువైట్..!!
- ముసందంలో డిస్కవరీ డైవింగ్ సెంటర్.. టూరిజానికి బూస్ట్..!!
- 2025లో కుటుంబం,బాలల రక్షణకు 4,400 రిపొర్టులు..!!
- ఇరాన్ నాయకత్వానికి ట్రంప్ బిగ్ వార్నింగ్
- పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- 'మన శంకర వర ప్రసాద్ గారు’ ప్రీమియర్ను నిర్వహించిన జనసేన గల్ఫ్సేన
- అంధుల మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ దీపికకు అరుదైన గౌరవం







