ట్రంప్ ఎఫెక్ట్.. యూఏఈ, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికాలో పెరుగనున్న చైనీస్ కార్లు..!!

- May 01, 2025 , by Maagulf
ట్రంప్ ఎఫెక్ట్.. యూఏఈ, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికాలో పెరుగనున్న చైనీస్ కార్లు..!!

యూఏఈ: యూఏఈ, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా (MEA) ప్రాంతంలో నడిచే చైనా తయారీ కార్లు రాబోయే కొన్ని సంవత్సరాలలో మూడు రెట్లు పెరుగుతాయని అంచనా వేశారు. దాని మార్కెట్ వాటా 2030 నాటికి 34 శాతం పెరుగుతుందని భావిస్తున్నారు.  ఇది 2024లో కేవలం 10 శాతం నుండి పెద్ద పెరుగుదల అని న్యూయార్క్‌కు చెందిన కన్సల్టింగ్ సంస్థ నివేదిక తెలిపింది. "ప్రపంచ ఆటోమోటివ్-ఎగుమతి మార్కెట్‌లో చైనా తన వాటాను పెంచుతూనే ఉంది. ప్రపంచ సుంకాల తుఫాను పరిశ్రమను పట్టిపీడిస్తున్నప్పటికీ, ఈ మార్ప వేగంగా పెరుగుతుంది." అని అలిక్స్‌పార్ట్‌నర్స్ దాని తాజా నివేదికలో తెలిపింది.  

“ఈ దశాబ్దం చివరి నాటికి చైనా, రష్యా , బెలారస్ వెలుపల ఆసియా దేశం ఉత్పత్తి చేసే వాహనాలలో MEA ప్రాంతం, రష్యా అత్యధిక వాటాను కలిగి ఉంటాయి. రష్యా,  మధ్యప్రాచ్యం కలిసి 2024లో చైనా వాహనాల ఎగుమతుల్లో 35 శాతం వాటాను కలిగి ఉన్నాయి.  ఇది మొదటిసారిగా యూరప్, ఉత్తర అమెరికాకు కలిపిన ఎగుమతులను అధిగమించింది.” అని తెలిపింది.  

2024లో చైనా ఎగుమతులు 23 శాతం పెరిగి 6.4 మిలియన్ల కు చేరుకున్నాయి. ఇది రెండవ స్థానంలో ఉన్న జపాన్ కంటే 50 శాతం కంటే ఎక్కువ అని తెలిపింది. "అమెరికా, ఇతర దేశాలు జారీ చేసిన సుంకాలు చైనా ఆటోమోటివ్ పరిశ్రమపై స్వల్ప ప్రభావాన్ని చూపుతాయి" అని నివేదిక వెల్లడించింది. అమెరికా, ఇతర దేశాల నుండి ఇటీవలి సుంకాలు చైనా వాహనం, ఆటో విడిభాగాల ఎగుమతుల ధరను దాదాపు 24 శాతం లేదా $46 బిలియన్లు పెంచినప్పటికీ, ఇది చైనా మొత్తం ఆటో-పరిశ్రమ ఉత్పత్తి విలువలో కేవలం 3.8 శాతం మాత్రమే అని తెలిపింది.

చైనా కార్ల తయారీదారులు మధ్యప్రాచ్యంలో వేగంగా ఆదరణ పొందుతున్నారు, ఈ ప్రాంతాన్ని వారి ప్రపంచ ఎగుమతులకు కీలకమైన వృద్ధి ఇంజిన్‌గా ఉంచుతున్నారని అలిక్స్‌పార్ట్‌నర్స్ భాగస్వామి & మేనేజింగ్ డైరెక్టర్ అలెశాండ్రో మిస్సాగ్లియా అన్నారు. చైనా వాహనాల పోటీ ధర, అధిక సాంకేతిక కంటెంట్‌ను వినియోగదారులు నమ్ముతున్నారని తెలిపారు.  ఎలక్ట్రిక్ వాహనాల (EVలు) వైపు క్రమంగా మారడంతో ఈ ధోరణి వేగవంతం అవుతుందని భావిస్తున్నారని తెలిపారు. 

కార్ల ధరలు తగ్గుతాయా?

యూఏఈలోని వినియోగదారులు చైనా నుండి వచ్చే కార్ల దరలు తగ్గుతాయని భావిస్తున్నారు.  మార్కెట్లలో కార్ల ధరలు తగ్గే అవకాశం ఉన్నందున వాహనదారులు, మరింత ముందుకు వెళ్లి మరిన్ని చైనీస్ కార్లను కొనుగోలు చేయవచ్చని డాలర్ అండ్ థ్రిఫ్టీ యూఏఈలో కార్ రెంటల్ డివిజన్ మేనేజింగ్ డైరెక్టర్ రాహుల్ సింగ్ తెలిపారు.          

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com