అల్ దఖిలియాలో అరుదైన వన్యప్రాణుల జాతుల సంరక్షణ..!!
- May 02, 2025
నిజ్వా: అల్ దఖిలియా గవర్నరేట్‌లోని కొత్త ఆవాసాలలో అనేక అంతరించిపోతున్న వన్యప్రాణుల జాతులను పర్యవేక్షిస్తున్నారు. పర్యావరణ అథారిటీ, కెమెరా ట్రాప్‌లతో సహా అధునాతన ట్రాకింగ్ టెక్నాలజీలను ఉపయోగించి జీవవైవిధ్యాన్ని కాపాడుతుంది. పర్యవేక్షణ కార్యకలాపాల కారణంగా మధ్య తరహా అడవి పిల్లి అరేబియా లింక్స్ ఉనికిని కాపాడారు. దాంతోపాటు అరేబియన్ తహర్( ఒక ప్రత్యేకమైన పర్వత మేక జాతి), ఎడారి పాక్షిక ఎడారి వాతావరణాలకు అనుగుణంగా ఉండటానికి ప్రసిద్ధి చెందిన అరేబియన్ తోడేలు వంటి జంతువులు అంతరించకుండా కాపాడినట్లు అల్ దఖిలియా గవర్నరేట్‌లోని పర్యావరణ విభాగం డైరెక్టర్ అహ్మద్ సలీం అల్ అమిరి తెలిపారు. వన్యప్రాణులను సంరక్షించడం, పర్యావరణ వ్యవస్థ స్థిరత్వాన్ని నిర్ధారించడం లక్ష్యంగా జాతీయ వ్యూహంతో ముందుకు వెళుతున్నట్లు పేర్కొన్నారు. పర్యావరణ ప్రయత్నాలకు మద్దతు ఇవ్వడంలో స్థానిక సమాజాల కీలక పాత్రను అల్ అమిరి హైలెట్ చేశారు. ఈ సహజ సంపద భవిష్యత్ తరాలకు నిలిచి ఉండేలా వన్యప్రాణులను రక్షించే నిబంధనలను పాటించాల్సిన అవసరాన్ని వివరించారు.
తాజా వార్తలు
- తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు
- బహ్రెయిన్ లో ఫుట్‌బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!
- పేలుళ్ల AI క్లిప్‌లు షేర్..10 మంది అరెస్టు..!!
- అక్సా మసీదు మూసివేతను ఖండించిన కువైట్..!!
- మస్కట్ లో EV ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణ..!!
- ముందు జాగ్రత్త చర్యలు..నిర్దేశిత ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న ఖతార్..!!
- BCCI Naman Awards 2026: ఐదు టైటిళ్ల విజేతలకు అవార్డులు
- గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్..జాగ్రత్త!!
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!









