నకిలీ ప్లేట్‌ వినియోగం..వ్యక్తి అరెస్టు.. Dh104,000 జరిమానా..!!

- May 02, 2025 , by Maagulf
నకిలీ ప్లేట్‌ వినియోగం..వ్యక్తి అరెస్టు.. Dh104,000 జరిమానా..!!

షార్జా: ట్రాఫిక్ సీసీ కెమెరాలను తప్పించుకోవడానికి తన వాహనంపై నకిలీ లైసెన్స్ ప్లేట్‌లను అమర్చిన ఒక వాహనదారుడిని అరెస్టు చేసినట్లు షార్జా పోలీసులు వెల్లడించారు. నిందితుడిని విచారించగా.. ఆ వ్యక్తి వాహనంపై 137 ట్రాఫిక్ ఉల్లంఘనలు, Dh104,000 జరిమానాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. వాహనదారుడిపై 308 ట్రాఫిక్ పాయింట్లు కూడా ఉన్నాయని పేర్కొన్నారు.

షార్జా పోలీసుల ట్రాఫిక్, పెట్రోల్స్ విభాగం డిప్యూటీ డైరెక్టర్ కల్నల్ ఒమర్ మొహమ్మద్ బు ఘనేమ్ మాట్లాడుతూ.. ఫీల్డ్ ట్రాఫిక్ అధికారులు, కంట్రోల్ అండ్ కమాండ్ సెంటర్ బృందం మధ్య మెరుగైన సమన్వయం ఫలితంగా సదరు వ్యక్తి చేసిన మోసాన్ని గుర్తించి, అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఎమిరేట్ లోని రహదారులపై ఉన్న అధునాతన భద్రతా నిఘా వ్యవస్థల కారణంగా సదరు వాహనాన్ని గుర్తించినట్లు పేర్కొన్నారు. 

నకిలీ ప్లేట్‌లను అమర్చడం , నంబర్‌లను కనిపించకుండా చేయడం వంటి కొన్ని డ్రైవర్ ప్రవర్తనలు కేవలం ట్రాఫిక్ నేరాలు మాత్రమే కాదని, చట్టపరమైన క్రిమినల్ కేసులుగా మారవచ్చని ఆయన హెచ్చరించారు. ఇలాంటి ప్రవర్తనలను సహించేది లేదని కల్నల్ బు ఘనేమ్ స్పష్టం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com