మిస్ వరల్డ్ పోటీలో 120 దేశాల నుంచి కంటెస్టంట్ల రాక: డీజీపీ
- May 03, 2025
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మిస్ వరల్డ్ పోటీల కార్యక్రమాలకు పకడ్బందీగా భద్రత ఏర్పాట్లను చేయాలని రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డాక్టర్ జితేందర్ ఐపీఎస్ పోలీస్ అధికారులను ఆదేశించారు.డిజిపి కార్యాలయంలో ప్రత్యేక సమావేశంలో పోలీసు ఉన్నతాధికారులతో డైరెక్ట్ జనరల్ ఆఫ్ పోలీస్ భద్రత ఏర్పాట్ల పై చర్చించారు. ఈ సందర్భంగా డిజిపి మాట్లాడుతూ రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ పెంచేలా మిస్ వరల్డ్ పోటీలను నిర్వహిస్తు న్నామని సీఎం ఆదేశాల మేరకు కట్టుదిట్టమైన చర్యలు చేపడు తున్నామన్నారు. ఈ పోటీలకు దాదాపు 120 దేశాల నుండి కంటెస్టెంట్లు రానున్నారని ఇప్పటివరకు 116 దేశాల కంటే స్టెంట్ల నుంచి సమాచారం వచ్చిందన్నారు.
దాదాపు నెల రోజుల పాటు వారు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో గ్రూపులు వారీగా పర్యటిస్తారని డిజిపి అన్నారు. మిస్ వరల్డ్ పోటీ కార్యక్రమాల హాజరయ్యే అతిథులు రాక శుక్రవారం నుండి మొదలైందని డీజీపీ తెలిపారు. ఈనెల 10 న మిస్ వరల్డ్ ప్రారంభ కార్యక్రమం జరుగనుందన్నారు. మిస్ వరల్డ్ షెడ్యూల్ లో భాగంగా ములుగు జిల్లాలోని రామప్ప దేవాలయం, నల్గొండ జిల్లాలోని బుద్ధవనం, మహ బూబ్ నగర్ లోని పిల్లలమర్రి దేవాలయం, వరంగల్ జిల్లాల్లోనూ, హైదరాబాదులోని లాల్ బజార్, సెక్రటేరియట్, రాచకొండ కమిషనరేట్ పరిధిలోని యాదగిరిగుట్ట దేవా లయం, ఉప్పల్ స్టేడియం, పోచంపల్లి, రామోజీ ఫిలిం సిటీ, తదితర ప్రాంతాలను గ్రూపుల వారీగా మిస్ వరల్డ్ కంటె స్టెంట్లు పర్యటిస్తారని తెలియజేశారు. ఆయా ప్రాంతాలను, కార్యక్రమాలను అనుసంధానం చేస్తూ కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేయనున్నమన్నారు. భారీ స్థాయిలో జరగనున్న ఈ పోటీలకు ప్రారంభ వేదికను గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహిస్తుండగా ఫైనల్ పోటీలను ఈనెల 31వ తేదీన హైటెక్స్ లో నిర్వహించనున్నామన్నారు. మిస్ వరల్డ్ పోటీలకు 120 దేశాల నుండి వచ్చే కంటె స్టెంట్లు, అతిధులు రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాలను సందర్శంచనున్నారని డీజీపీ వివరించారు.
తాజా వార్తలు
- మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్లో అరుదైన అత్యవసర శస్త్రచికిత్స
- 5 నిమిషాల స్కాన్ తో ముందుగానే గుండె జబ్బుల గుర్తింపు..!!
- ఒమన్ లో 31వేల మంది కార్మికుల పై కేసులు నమోదు..!!
- రియాద్ మెట్రోలో మొదటి బేబీ బర్న్..!!
- కువైట్ లో కార్మికశాఖ విస్తృత తనిఖీలు..!!
- ఖతార్ లో స్ట్రాంగ్ విండ్స్, డస్ట్ ఫోర్ కాస్ట్..!!
- ISB యూత్ ఫెస్టివల్..ఓవరాల్ ఛాంపియన్గా ఆర్యభట్ట హౌస్..!!
- ఏడాదిలో 5 ఉల్లంఘనలకు పాల్పడితే.. డ్రైవింగ్ లైసెన్స్ రద్దు..!!
- ఆన్లైన్ మోసగాళ్లకు కోర్టు షాక్..
- గ్రీన్ హైడ్రోజన్తో భారత్ శక్తి విప్లవం







