నవజాత శిశువుల తల్లులకు అదనపు సెలవులు.. ఆమోదించిన షార్జా రూలర్..!!

- May 06, 2025 , by Maagulf
నవజాత శిశువుల తల్లులకు అదనపు సెలవులు.. ఆమోదించిన షార్జా రూలర్..!!

యూఏఈ: షార్జా ప్రభుత్వంలో మహిళా ఉద్యోగులకు 'కేర్ లీవ్' అని పిలువబడే కొత్త రకం సెలవు ఆమోదించింది. నిరంతర సంరక్షణ అవసరమయ్యే అనారోగ్యంతో లేదా వికలాంగుడైన బిడ్డకు జన్మనిచ్చే తల్లులకు  సెలవులను పొడిగించారు. షార్జా మానవ వనరుల విభాగం ఛైర్మన్ అబ్దుల్లా ఇబ్రహీం అల్ జాబీ డైరెక్ట్ లైన్ రేడియో కార్యక్రమంలో ప్రకటించారు. ప్రసూతి సెలవు పూర్తయిన తర్వాత ప్రారంభమయ్యే సెలవును ఏటా మూడు సంవత్సరాల వరకు పొడిగించవచ్చు.

కొత్త నిబంధన ప్రకారం.. వైద్య నివేదిక సమర్పణ ఆధారంగా సెలవు మంజూరు చేయబడుతుంది. ఇది ప్రారంభంలో ఒక సంవత్సరం చెల్లింపు ప్రసూతి సెలవుతో ఏకకాలంలో ఉంటుంది. అధికారుల ఆమోదంతో వీటిని మూడు సంవత్సరాల వరకు పొడిగించుకోవచ్చు.సుప్రీం కౌన్సిల్ సభ్యుడు, షార్జా పాలకుడు షేక్ డాక్టర్ సుల్తాన్ బిన్ మొహమ్మద్ అల్ ఖాసిమి ఆదేశాలలో భాగంగా కేర్ లీవ్స్ నవజాత శిశువులతో వైద్యపరమైన సవాళ్లను ఎదుర్కొంటున్న పని చేసే తల్లులకు మద్దతు ఇవ్వడం లక్ష్యమని పేర్కొన్నారు. పిల్లల ఆరోగ్య పరిస్థితి మెరుగుపడితే, అధికారులు సెలవులను రద్దు చేస్తారు. ఒకవేళ సెలవులను మూడు సంవత్సరాలకు మించి పొడిగించాల్సిన సందర్భాలలో, హయ్యర్ కమిటీ ఫర్ హ్యూమన్ రిసోర్సెస్‌కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com