ఆన్‌లైన్‌లో వ్యక్తిని బెదిరించిన కొడుకు..తండ్రికి Dh3,000 ఫైన్..!!

- May 06, 2025 , by Maagulf
ఆన్‌లైన్‌లో వ్యక్తిని బెదిరించిన కొడుకు..తండ్రికి Dh3,000 ఫైన్..!!

యూఏఈ: స్నాప్‌చాట్‌లో మైనర్ బెదిరించిన తర్వాత, అల్ ఐన్‌లోని ఒక సివిల్ కోర్టు Dh3,000 పరిహారం చెల్లించాలని మైనర్ సంరక్షకుడిని ఆదేశించింది.  స్నాప్‌చాట్ ద్వారా పంపిన బెదిరింపు సందేశాల వల్ల కలిగే హానిని పేర్కొంటూ, బాధితుడు Dh50,000 నష్టపరిహారం కోరుతూ మైనర్ తండ్రిపై దావా వేశారు. అల్ ఐన్ సివిల్, కమర్షియల్, అడ్మినిస్ట్రేటివ్ క్లెయిమ్స్ కోర్టు పరిస్థితిని అంచనా వేసి, బాధితుడు అనుభవించిన భావోద్వేగ , నైతిక హానికి Dh3,000 పరిహారం అందజేయాలని ఆదేశించింది.  

యూఏఈ సివిల్ లావాదేవీల నిబంధనల ప్రకారం.. చట్టవిరుద్ధమైన చర్యల వల్ల కలిగే ఏదైనా నిరూపితమైన హాని బాధితుడికి పరిహారం పొందే హక్కును ఇస్తుందని కోర్టు ఈ సందర్భంగా తెలిపింది. మైనర్ వాస్తవానికి బూతు పదాలను ఉపయోగించాడని, వాదిని పరోక్షంగా బెదిరించి,  బాధితుడి ప్రతిష్టకు,  మానసికంగా హాని కలిగించాడని పేర్కొంది.   

మైనర్లకు సంబంధించిన కేసులలో.. ముఖ్యంగా సైబర్ నేరాలు, సోషల్ మీడియా దుష్ప్రవర్తనకు సంబంధించిన కేసులలో తల్లిదండ్రులు, సంరక్షకుల జవాబుదారీతనాన్ని ఈ తీర్పు గుర్తుచేసిందని  దుబాయ్‌లో ఉన్న లీగల్ కన్సల్టెంట్ అహ్మద్ రషెద్ అన్నారు.   బ్లాక్‌మెయిల్,  ఎలక్ట్రానిక్ బెదిరింపులకు వ్యతిరేకంగా యూఏఈలో స్పష్టమైన నిబంధనలు ఉన్నాయని అన్నారు.  కేసు తీవ్రతను బట్టి జైలు శిక్ష,  Dh250,000 నుండి Dh500,000 వరకు జరిమానాలు విధించే హక్కు కోర్టులకు ఉంటుందన్నారు.  ఇలాంటి కేసులలో పరిహారం పొందడంతోపాటు సివిల్ కేసులను కూడా వేసే అవకాశం ఉందన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com