టైర్లు పేలతాయ్: వాహనదారులకు హెచ్చరిక
- July 09, 2016
పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో వాహనదారులకు టైర్ల రూపంలో ప్రమాదాలు పొంచి ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రెండు రోజుల్లోనే సల్వా రోడ్‌పై వరుసగా రెండు ప్రమాదాలు టైర్లు పేలడంతో సంభవించాయి. ఖతార్‌లో నిబంధనల ప్రకారం రెండేళ్ళ కాలానికి టైర్ల లైఫ్ ముగుస్తుంది. లైఫ్ ముగిసిన తర్వాత కేవలం ఒక్క సంవత్సరానికి మాత్రమే ఉపయోగించడానికి వీలుంటుంది. సేఫ్టీ విషయంలో వాహనదారులు ఏమాత్రం అజాగ్రత్త పాటించడానికి వీల్లేదు. తక్కువ ఖరీదు టైర్లు 200 ఖతారీ రియాల్స్‌లో దొరుకుతాయి. అదే మంచి టైర్ కొనాలంటే మాత్రం 400 ఖతారీ రియాల్స్ వెచ్చించాల్సిందే. ప్రాణాలతో పోల్చితే ఈ ఖర్చు ఎక్కువేమీ కాదు. ఎండ వేడిమికి టైర్లలోని పీడనం పెరిగి, టైర్లు పేలిపోయేందుకు అవకాశాలెక్కువ. అందుకే వాహనాన్ని బయటకు తీసేటప్పుడు విధిగా టైర్లను పరిశీలించాలి, అందులో ఎయిర్ కండిషన్‌ని చూసుకోవాలి. కార్లు వంటి వాహనాలే కాకుండా ద్విచక్ర వాహనాలూ ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలి.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







