కువైట్‌లో బలమైన గాలులు, లో విజిబిలిటీ..!!
- May 08, 2025
కువైట్: రాగల మూడు రోజులపాటు దేశవ్యాప్తంగా బలమైన గాలులు వీస్తాయని కువైట్ వాతావరణ శాఖ తెలిపింది. వాతావరణ శాఖ తాత్కాలిక డైరెక్టర్ ధరర్ అల్-అలీ మాట్లాడుతూ.. బుధవారం ఉదయం నుండి బలమైన గాలులు ప్రారంభమవుతాయని తెలిపారు. పగటిపూట గాలి వేగం గంటకు 55 కి.మీ కంటే ఎక్కువగా ఉంటుందని, ముఖ్యంగా ఎడారి ప్రాంతాలలో హారిజంటల్ లో విజిబిలిటీ భారీగా తగ్గే అవకాశం ఉంటుందని వెల్లడించారు. కాగా, రాత్రి సమయంలో గాలి తీవ్రత కొద్దిగా తగ్గుతుందని, కొన్ని ప్రాంతాలలో గాలులు గంటకు 40 కి.మీ వరకు చేరుకోవచ్చని అల్-అలీ తెలిపారు. వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. సముద్రపు అలలు ఆరు అడుగులకు మించి ఉండవచ్చని హెచ్చరించారు.
తాజా వార్తలు
- భారత్కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్