దుబాయ్ డ్యూటీ ఫ్రీ డ్రా..భారతీయ ప్రవాసిని వరించిన $1 మిలియన్..!!
- May 08, 2025
దుబాయ్: అజ్మాన్‌లో నివసిస్తున్న 52 ఏళ్ల భారతీయుడు వేణుగోపాల్ ముల్లాచేరి దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలియనీర్ డ్రాలో $1 మిలియన్ గెలుచుకున్నాడు. ఏప్రిల్ 23న టెర్మినల్ 2 అరైవల్ షాపులో కొనుగోలు చేసిన టికెట్ నంబర్ 1163తో సిరీస్ 500 ప్రమోషన్లో అతను 500వ విజేతగా నిలిచాడు. ఒక దశాబ్దానికి పైగా అజ్మాన్‌లో నివసిస్తున్న ముల్లాచేరి.. అధికారిక దుబాయ్ డ్యూటీ ఫ్రీ ఫేస్బుక్ పేజీలో ప్రత్యక్ష డ్రాను వీక్షించాడు. తన పేరు ప్రకటించగానే ఎంతో సంతోషం కలిగిందని పేర్కొన్నారు.
ముల్లాచేరి ఇద్దరు పిల్లల తండ్రి. అజ్మాన్‌లోని ఒక కంపెనీకి IT సపోర్ట్ స్పెషలిస్ట్‌గా పనిచేస్తున్నాడు. 15 సంవత్సరాలకు పైగా ప్రమోషన్లో పాల్గొంటున్నాడు. ఈ సందర్భంగా స్పందిస్తూ.. ‘‘దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలియనీర్‌లో 500వ విజేతగా నిలిచినందుకు నేను సంతోషంగా ఉన్నాను. ఈ ప్రసిద్ధ ప్రమోషన్లో చాలా కాలంగా పాల్గొంటున్న. చివరకు అనేక మంది విజేతలలో ఒకరిగా ఉండటం నాకు చాలా ఆనందంగా ఉంది. దుబాయ్ డ్యూటీ ఫ్రీకి చాలా ధన్యవాదాలు.” అని పేర్కొన్నారు. కేరళకు చెందిన ముల్లాచేరి 1999 నుండి మిలీనియం మిలియనీర్ ప్రమోషన్లో $1 మిలియన్ గెలుచుకున్న 249వ భారతీయుడిగా నిలిచాడు.
దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని కాన్కోర్స్ Bలో వేడుక డ్రా జరిగింది. దుబాయ్ సివిల్ ఏవియేషన్ అథారిటీ అధ్యక్షుడు, దుబాయ్ డ్యూటీ ఫ్రీ చైర్మన్ షేక్ అహ్మద్ బిన్ సయీద్ అల్ మక్తూమ్ హాజరయ్యారు.
తాజా వార్తలు
- BITS పిలానీ–డైమ్లర్ ట్రక్ ఇన్నోవేషన్ సెంటర్ భాగస్వామ్యం
- అల్ అమరాత్లో ప్రభుత్వ భూముల అక్రమ ఆక్రమణలపై మస్కట్ మున్సిపాలిటీ కొరడా
- తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు..
- ‘వాళ్లు మాట్లాడుకోనివ్వండి’.. విమర్శలను ఎదుర్కోవడం పై షేక్ మహమ్మద్ కీలక సందేశం
- డేటా సెంటర్లకు నీటి వినియోగం పై సీఎం చంద్రబాబు స్పష్టత
- పిల్లల గేమింగ్ లింకులపై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- యూఏఈలో ఆగస్టు 31 నుంచి స్కూల్స్ రీ ఓపెన్..తదుపరి సెలవులు ఎప్పుడంటే?
- ఇంట్లో అక్రమంగా క్లినిక్.. విదేశీ మహిళ అరెస్ట్..!!
- బరువు తగ్గించే మందులపై ఖతార్ వైద్య నిపుణుల హెచ్చరిక..!!
- సౌదీలో భారీ డిస్కౌంట్లు.. 10 లక్షలకు పైగా ఉత్పత్తులపై ధరల తగ్గింపు..!!







