భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతల పై ట్రంప్ స్పందన

- May 08, 2025 , by Maagulf
భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతల పై ట్రంప్ స్పందన

భారత్, పాకిస్తాన్‌ల మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకీ తీవ్రతరమవుతున్నాయి. ఇదే నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. రెండు దేశాల మధ్య గల సమస్యలు త్వరగా ముగియాలని ఆయన ఆకాంక్షించారు.బుధవారం వాషింగ్టన్‌లో మీడియాతో మాట్లాడిన ట్రంప్, “ఇది చాలా గంభీరమైన పరిస్థితి” అని అన్నారు. భారత్, పాకిస్తాన్‌ల మధ్య ఉన్న ఉద్రిక్తతలపై తాను ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు.ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. దానికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ ఈ ఉద్రిక్తతలకు నాంది చెప్పింది. ఈ దాడిలో పీఓకేలోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ వైమానిక దాడులు జరిపింది.

“నాకు భారత్, పాకిస్తాన్ రెండింటితో మంచి సంబంధాలున్నాయి,” అని ట్రంప్ చెప్పారు. “ఇరు దేశాల నేతలు నాకు సన్నిహితులు. వారు సమస్యను మాట్లాడుకుని పరిష్కరించాలి. తక్షణమే ఈ ఉద్రిక్తతలు ఆగాలి,” అని అన్నారు.ట్రంప్ చెప్పిన మాటల్లో ప్రధాన విషయం – శాంతికి తనవంతు సహాయాన్ని ఇవ్వడానికి తానెప్పుడూ సిద్ధమన్నది. “నా చేత ఏదైనా సాధ్యమైతే, నేను సహాయం చేయడానికి వెనుకాడను,” అని ఆయన స్పష్టం చేశారు.

అమెరికా విదేశాంగ మంత్రి కూడా స్పందన
ఈ నేపథ్యంలో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కూడా స్పందించారు. “ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను నేను గమనిస్తున్నాను,” అని చెప్పారు.మార్కో రూబియో “ఎక్స్” లో పోస్ట్ చేస్తూ, ట్రంప్ వ్యాఖ్యలకు మద్దతు తెలిపారు. “ఈ ఘర్షణలు త్వరగా ముగియాలని నేను కోరుకుంటున్నాను. శాంతియుత పరిష్కారం కోసం చర్చలు అవసరం,” అని రాసారు.ఈ ఘటనల నేపథ్యంలో, ప్రపంచ దేశాలంతా శాంతికి పిలుపునిస్తున్నాయి. భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గించాలని కోరుతున్నవారిలో అమెరికా ముందంజలో ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com