భార‌త్ ఎయిర్ బేస్‌లే టార్గెట్‌గా పాక్ దాడులు..

- May 08, 2025 , by Maagulf
భార‌త్ ఎయిర్ బేస్‌లే టార్గెట్‌గా పాక్ దాడులు..

భారత్–పాక్ మధ్య యుద్ధం జరుగుతున్న సమయంలో, జమ్మూ విమానాశ్రయంపై రాకెట్ దాడి జరిగింది. జమ్మూ, పఠాన్‌కోట్‌ల పై పాక్ డ్రోన్ దాడి చేయ‌గా..పఠాన్‌కోట్ వైమానిక స్థావరం సమీపంలో భారీ పేలుళ్లు సంభవించాయి.అంతే కాకుండా,జమ్మూలోని ఏడు చోట్ల పెద్ద పేలుళ్ల శబ్దాలు వినిపించాయి, దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

పరిస్థితిని అదుపు చేయడానికి భారత సైన్యం వేగంగా చర్యలు తీసుకుంది. జమ్మూ విమానాశ్రయం నుంచి బయలుదేరిన భారత యుద్ధ విమానాలు.. పాకిస్తాన్ కు చెందిన మూడు యుద్ధ విమానాలను కూల్చివేసాయి. భారత సైన్యం పాకిస్తాన్ క్షిపణులను తిప్పికొట్టి…ప‌లు ప్రాంతాలలో పాకిస్తాన్ డ్రోన్లు, 8 క్షిపణులను కూల్చివేసింది.

జ‌మ్మూ, కశ్మీర్, అఖ్నూర్ ప్రాంతాల్లో సైర‌న్ లు మోగాయి.ప్రజల భద్రత కోసం స్థానిక అధికారులు వార్నింగ్ జారీ చేశారు. ప్ర‌జ‌లు ఇళ్లలోనే ఉండాలని సూచించారు.ఈ ప్రాంతంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేసి, సైన్యం పటిష్ట పహారా ఏర్పరిచింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com