జమ్మూ కాల్పుల్లో తెలుగు జవాన్ మృతి
- May 09, 2025
శ్రీనగర్: పహల్గాం ఉగ్రదాడుల అనంతరం భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది.ఈ క్రమంలో పాక్ కేంద్రంగా పనిచేస్తున్న పలు తీవ్ర వాద స్థావరాలపై భారత్ మెరుపుదాడులు చేసింది.ఈ క్రమంలో రెండు దేశాల మధ్య యుద్ధం కొనసాగుతోంది. దేశంలోని సరిహద్దు రాష్ట్రాలపై పాకిస్థాన్ సైన్యం దాడులు చేస్తోంది. దీన్ని భారత సైన్యం దీటుగా తిప్పికొడుతోంది. ఈ యుద్ధంలో ఇప్పటికే పలువురు సైనికులతో పాటు సామాన్యులు కూడా మరణించారు.
కాగా జమ్మూకాశ్మీర్‌లో పాకిస్థాన్ మూకలు జరిపిన కాల్పుల్లో తెలుగు జవాన్ వీరమరణం పొందినట్లు సమాచారం అందింది. మృతిచెందిన జవాన్ ను మురళీ నాయక్‌గా గుర్తించారు. మురళీది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సత్యసాయి జిల్లా కల్లి తండా అని తెలుస్తోంది. రేపు మురళీనాయక్ మృతదేహాన్ని స్వస్థలానికి తరలించనున్నట్లు అధికారులు వెల్లడించారు.
కాగా మురళీ నాయక్ స్వస్థలం సత్యసాయి జిల్లా గోరంట్ల మండలానికి చెందిన కల్లి తండా అయినప్పటికీ సోమందేపల్లి మండలం నాగినాయని చెర్వుతాండాలో పెరిగాడు. సోమందేపల్లిలోని విజ్ఞాన్ పాఠశాలలో చదివినట్లు స్థానికులు తెలిపారు. జవాన్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మురళీనాయక్ మరణవార్త తెలిసిన స్థానికులు వీధుల్లో ఆయన ఫోటో పెట్టి నివాళులు అర్పిస్తున్నారు. అదే సమయంలో పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా నినదాలు చేస్తున్నారు.
కాగా మురళినాయక్ మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. “దేశ రక్షణలో శ్రీ సత్యసాయి జిల్లా, పెనుకొండ శాసనసభ నియోజకవర్గం, గోరంట్ల మండలానికి చెందిన మురళి నాయక్ అనే సైనికుడు ప్రాణాలు కోల్పోవడం విషాదకరం. దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుడు మురళి నాయక్ కు నివాళులు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.’ అంటూ ట్వీట్ చేశారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







