చైనా విద్యుత్ వస్తువుల పై ఖతార్ డంపింగ్ సుంకాలు..!!
- May 12, 2025
దోహా: జాతీయ ఆర్థిక వ్యవస్థకు మద్దతు ఇవ్వడం, స్థానిక ఉత్పత్తులను రక్షించడం కోసం వాణిజ్య , పరిశ్రమల మంత్రిత్వ శాఖ (MoCI) కొత్త నిర్ణయాన్ని తీసుకుంది. చైనా నుండి ఎగుమతి అవుతున్న 1000 వోల్ట్లకు మించని వోల్టేజ్ కోసం ఎలక్ట్రికల్ ఫిట్టింగ్లు, స్విచ్లు, ప్లగ్లు, సాకెట్లపై డంపింగ్ వ్యతిరేక సుంకాలను విధించాలని నిర్ణయించింది. ఇందులో మార్కెట్ లో స్థిరమైన వాణిజ్య వాతావరణాన్ని పెంపొందించడానికి జాతీయ ఉత్పత్తులకు, జాతీయ ఆర్థిక వ్యవస్థ స్థిరత్వానికి హాని చేసే దిగుమతులను నిరోధించడానికి డంపింగ్ సుంకాలను ప్రవేశపెట్టినట్లు ప్రకటించింది. యాంటీ-డంపింగ్ సుంకాలు సెప్టెంబర్ 25, 2029 వరకు విధించబడతాయని స్పష్టం చేసింది. అధికారిక గెజిట్లో ప్రచురించబడిన మరుసటి రోజు నుండి ఇది అమల్లోకి వస్తుందని మంత్రిత్వశాఖ తెలిపింది.
తాజా వార్తలు
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్లో సంక్రాంతి సంబరాలు







