NEET UG సిలబస్‌ విడుదల

- January 11, 2026 , by Maagulf
NEET UG సిలబస్‌ విడుదల

న్యూ ఢిల్లీ: నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ అండర్ గ్రాడ్యుయేట్ నీట్ యూజీ–2026 సిలబస్‌ను నేషనల్ మెడికల్ కమిషన్ (NMC)విడుదల చేసింది. ఈ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించనుంది. తాజా సిలబస్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ సబ్జెక్టులకు సంబంధించిన అంశాలను యూనిట్ల వారీగా వివరించారు. నీట్ యూజీ–2026 పరీక్ష వచ్చే ఏడాది మే నెలలో జరిగే అవకాశముందని అధికారులు తెలిపారు. పరీక్షకు సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ త్వరలో విడుదల కానుంది. పూర్తి వివరాలు https://www.nmc.org.in/ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.

కాగా NEET UG అనేది దేశ వ్యాప్తంగా ఉన్న మెడికల్ కాలేజీల్లో MBBS, BDS ఇతర అనుబంధ ప్రోగ్రామ్‌లతో సహా అండర్ గ్రాడ్యుయేట్ వైద్య కోర్సులలో ప్రవేశానికి నిర్వహించే ఏకైక జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష. NEET UG 2026 రాయాలనుకునే అభ్యర్థులు NEET UG 2026కి సంబంధించిన మరిన్ని అప్‌డేట్‌లు, వివరణాత్మక సూచనలు, నోటీసుల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను http://nta.ac.in లేదా NEET UG పోర్టల్ http://neet.nta.nic.in ని క్రమం తప్పకుండా తనిఖీ చేయాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com