బాబు బంగారం పాటల విడుదల
- July 09, 2016
విక్టరి వెంకటేశ్, నయనతార జంటగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'బాబు బంగారం'. ఒక్క సాంగ్ మినహా షూటింగ్ అంతా పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే థియేటర్లలోకి రానుంది. జూలై 9న మూవీకి సంబంధించి సింగిల్ ట్రాక్ ని విడుదల చేస్తామన్న చిత్ర యూనిట్, తాజాగా మల్లెల వానలా అంటూ సాగే ట్రాక్ ని విడుదల చేసింది. ఇక గిబ్రాన్ అందించిన ఆడియోను ఈ నెలాఖరులో విడుదలచేసే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. కబాలి మూవీ రిలీజ్ ని బట్టి బాబు బంగారం చిత్ర రిలీజ్ ఉంటుందని ఫిలిం నగర్ టాక్. బాబు బంగారం చిత్రంలో ఏసీపీ కృష్ణగా వెంకటేష్ అలరించనున్నాడు. షావుకారు జానకి, బ్రహ్మానందం, పోసాని కృష్ణ మురళి, పృథ్వీ, జయప్రకాశ్, రఘుబాబు, బ్రహ్మాజి, సంపత్, మురళి శర్మ, వెన్నెల కిషోర్, మున్నావేణు, గిరిధర్, అనంత్, రాజా రవీంద్ర తదితరులు ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మరి తాజాగా విడుదలైన ఆ సింగిల్ ట్రాక్ పై మీరు ఓ లుక్కేయండి.
తాజా వార్తలు
- UAE participates in 12th GCC Labour Minister’s Committee meeting in Bahrain
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..







