అజయ్ దేవగన్ విజయేంద్రప్రసాద్ దర్శకత్వంలో..

- July 09, 2016 , by Maagulf
అజయ్ దేవగన్ విజయేంద్రప్రసాద్ దర్శకత్వంలో..

దర్శక దిగ్గజం రాజమౌళి తండ్రి.. సినిమా స్టోరీ రైటర్ విజయేంద్ర ప్రసాద్ హవా బాలీవుడ్ లో కొనసాగుతోంది. అనిల్ కపూర్ హీరోగా 2001లో శంకర్ తెరకెక్కించిన బాలీవుడ్ మూవీ 'నాయక్'(తెలుగులో ఒకే ఒక్కడు) సినిమా సీక్వెల్ కి విజయేంద్రప్రసాద్ కథ అందిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అజయ్ దేవగన్ హీరోగా తెరకెక్కబోతోన్న మరో బాలీవుడ్ మూవీకి కూడా విజయేంద్రప్రసాద్ కథ అందిస్తున్నారని బాలీవుడ్ వర్గాల సమాచారం.
వివాదాస్పదమైన బాబ్రీ మసీదు ఇతివృత్తంతో ఈ సినిమా తెరకెక్కబోతోంది. 'కబీర్' టైటిల్ తో తెరకెక్కబోయే ఈ సినిమాలో ప్రముఖ బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాకు కథా రచయిత విజయేంద్రప్రసాదే దర్శకత్వం వహిస్తారని అంటున్నారు. సెన్సార్ బోర్డు చీఫ్ పహ్లాజ్ నిహ్లాని ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఆరునెలల ముందే ఈ ప్రాజెక్ట్ అనుకున్నప్పటికీ, వివాదాస్పదమైన ఈ సినిమా కథా చర్చలు ఇప్పటికి ఒక కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది. త్వరలోనే ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్తుందంటున్నారు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com