లక్ష్మీ బాంబ్ చిత్రంలో హీరోయిన్ మంచు లక్ష్మీ..
- July 09, 2016
మంచు లక్ష్మీ ప్రసన్న ప్రధాన పాత్రలో గునపాటి సురేష్ రెడ్డి సమర్పణలో ఉద్బబ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రూపొందుతోన్న కొత్త చిత్రం లక్ష్మీ బాంబ్. ఫ్రమ్ శివకాశి అనేది ట్యాగ్ లైన్. కార్తికేయ గోపాలకృష్ణ దర్శకత్వంలో వేళ్ల మౌనిక చంద్రశేఖర్, ఉమ లక్ష్మి నరసింహ నిర్మాతలుగా ఈ చిత్రం రూపొందుతోంది. ప్రస్తుతం ఈ సినిమా రెగ్యులర్‌షూటింగ్ జరుపుకుంటోంది.మంచి కామెడి థ్రిల్లర్, కొత్త కాన్సెప్ట్ గా తెరకెక్కుతున్న లక్ష్మీ బాంబ్ చిత్రంలో మంచు లక్ష్మీ జడ్జ్ పాత్రలో నటిస్తున్నట్టు చిత్ర దర్శకుడు తెలిపారు. ఈమె రోల్ చాలా పవర్ ఫుల్‌గా ఉంటుందట. దీపావళి టపాసుల్లో లక్ష్మీ బాంబ్ ఎంత పవర్ ఫుల్ గా ఉంటుందో ఈ సినిమాలో లక్ష్మీ పాత్ర కూడా అలానే ఉంటుందని చిత్ర నిర్మాతలు వేళ్ల మౌనిక చంద్రశేఖర్, ఉమా లక్ష్మి నరసింహ తెలియజేశారు. ప్రస్తుతం జరుగుతున్న రెగ్యులర్ షూటింగ్ ఆగస్టు వరకు జరుగుతుంది. ఈ సింగిల్ షెడ్యూల్‌తో షూటింగ్ పార్ట్ పూర్తవుతుంది. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను ప్రేక్షకుల ముందుకు వీలైనంత త్వరగా తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నాం అని దర్శకుడు కార్తికేయ గోపాలకృష్ణ వెల్లడించారు.మంచు లక్ష్మీ ప్రసన్న, పోసాని కృష్ణమురళి, హేమ, ప్రభాకర్, హేమంత్, రాకేష్, అమిత్, జీవా, రాజబాబు, శరత్, రాజారవీంద్ర తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం సునీల్ కశ్యప్ అందిస్తున్నారు
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







