ఆఫ్రికా దేశాల పర్యటనలో ఉన్న భారత ప్రధాని..
- July 10, 2016
ఆఫ్రికా దేశాల పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్రమోదీ టాంజానియా చేరుకున్నారు. దక్షిణాఫ్రికాలోని డర్బన్‌లో ప్రసంగం ముగించుకున్న అనంతరం శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత టాంజానియాలోని జూలియన్ నైరెరె ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి.. ఆ దేశ ప్రధాని కసీమ్ మజలివా సాదరస్వాగతం పలికారు. టాంజానియా సంప్రదాయ నృత్యాలతో మోదీని స్వాగతించారు అక్కడి ప్రజలు.పర్యటనలో భాగంగా ఆ దేశాధ్యక్షుడు జాన్ మగుఫులితో మోదీ ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా కొన్ని ఒప్పందాలపై ఇరువురు సంతకాలు చేయనున్నారు. టాంజానియాలో నివసిస్తున్న భారతీయులను మోదీ కలవనున్నారు. అక్కడి నుంచి మోదీ.. కెన్యా బయలుదేరుతారు
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







