స్లీపర్ బస్సులో మంటలు–ఐదుగురు సజీవదహనం
- May 15, 2025
లక్నో: ఉత్తర్ప్రదేశ్ రాజధాని లక్నో కిసాన్పాత్లో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బిహార్ నుంచి ఢిల్లీకి వెళ్తున్న స్లీపర్ బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఐదుగురు సజీవ దహనమయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దరాయప్తు చేస్తున్నారు.
అయితే, ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. మంటలు రావడానికి కారణం ఏంటో ఆరా తీస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో 80 మంది ప్రయాణికులు బస్సులో ఉన్న సమాచారం. ఘటనలో ఐదుగురు సజీవ దహనం కాగా.. మృతుల్లో ఇద్దరు పిల్లలు, ఇద్దరు మహిళలు ఉన్నారు. వేకువ జామున 5గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్ పై దాడి చేస్తాం అంటూ ట్రంప్ కు వార్ణింగ్ ఇచ్చిన ఖమేనీ
- MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!
- సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- కువైట్లో న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ గడువు పొడిగింపు..!!
- ముసందమ్ గవర్నరేట్లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!
- జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!
- 2026ను "ఇసా ది గ్రేట్ ఇయర్"గా ప్రకటించిన కింగ్ హమద్..!!
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు







