సరస్వతి పుష్కరాలు ప్రారంభం

- May 15, 2025 , by Maagulf
సరస్వతి పుష్కరాలు ప్రారంభం

తెలంగాణ: దక్షిణ అరణ్య శైవక్షేత్రంగా పేరొందిన కాళేశ్వరంలోని త్రివేణి సంగమంలో గురువారం తెల్లవారుజామున 5.44 నిమిషాలకు మాధవానంద సరస్వతి ప్రత్యేక పూజలతో సరస్వతి పుష్కరాల పుణ్య క్రతువు అట్టహాసంగా ప్రారంభమైంది.

త్రివేణి సంగమంలో అంతర్వాహిని వద్ద గణపతి పూజతో సరస్వతి పుష్కరాలు ప్రారంభంకాగా రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు శైలజ రామయ్యార్ దంపతులు, భూపాలపల్లి శాసనసభ్యుల గండ్ర సత్యనారాయణ రావు పద్మ , జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, హై కోర్టు న్యాయమూర్తి సూరపల్లి నంద పూజల్లో పాల్గొని తెల్లవారుజామున 5.45 నిమిషాలకు మాధవానంద సరస్వతి చేతుల మీదుగా పుష్కర పుణ్యస్నానం ఆచరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com