అమెరికా, దాని మిత్రదేశాలపై ప్రతీకారం తీర్చుకుంటా: హమ్జా లాడెన్
- July 10, 2016
అమెరికా, దాని మిత్రదేశాలపై ప్రతీకారం తీర్చుకుంటామని బిన్ లాడెన్ కొడుకు హమ్జా లాడెన్ హెచ్చరించాడు. తన తండ్రి చావుకు కారణమైన అందరిపైనా దాడులు చేస్తామని తాజాగా విడుదలైన ఓ ఆడియో టేప్‌లో అతను స్పష్టంచేశాడు. వీ ఆర్ ఆల్ ఒసామా పేరుతో ఉన్న 21 నిమిషాల నిడివి కలిగిన ఆ ఆడియో టేపును ఆన్లైన్లో పోస్ట్ చేసింది అల్‌ఖైదా. పాలస్తీనా, ఆఫ్ఘనిస్థాన్, సిరియా, ఇరాక్, యెమెన్, సోమాలియాతోపాటు ఇతర ముస్లిం దేశాల ప్రజలను అమెరికా అణిచివేయడానికి ప్రయత్నిస్తోందని, దానికి తగిన ఫలితం అనుభవించాల్సిందేనని హమ్జా హెచ్చరించాడు. లాడెన్ కోసమే కాదు ఇస్లాంను రక్షించడానికి ప్రయత్నిస్తున్న అందరి తరఫున అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంటామని అన్నాడు. 9/11 దాడుల తర్వాత పాకిస్థాన్‌లోని అబోటాబాద్‌లో తలదాచుకుంటున్న లాడెన్‌ను 2011లో అమెరికా సైనికులు హతమార్చిన విషయం తెలిసిందే. అప్పటి నుంచీ అతని కొడుకు హమ్జా నేతృత్వంలో అల్‌ఖైదాను మళ్లీ ఒక్కటి చేయాలని ఆ ఉగ్రవాద సంస్థ సీనియర్ నేతలు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో హమ్జా ఆడియో టేప్ అమెరికాకు డేంజర్ సిగ్నల్స్‌ను పంపిస్తోంది.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







