యూఏఈలో ట్రంప్: $14.5 బిలియన్ల బోయింగ్-GE ఒప్పందం..!!
- May 16, 2025
యూఏఈ: ట్రంప్ తన మూడు దేశాల గల్ఫ్ పర్యటనలో భాగంగా గురువారం యూఏఈకి చేరుకున్నారు. ఎమిరేట్స్‌కు వెళ్లిన రెండవ అమెరికా అధ్యక్షుడిగా గుర్తింపు పొందారు. ఆయన వచ్చిన తర్వాత అబుదాబిలోని షేక్ జాయెద్ గ్రాండ్ మసీదును సందర్శించి, ఆపై అధ్యక్ష భవనం కస్ర్ అల్ వతన్‌కు వెళ్లారు. యూఏఈ రాబోయే దశాబ్దంలో యుఎస్‌లో $1.4 ట్రిలియన్లు పెట్టుబడి పెట్టే ప్రణాళికలను ప్రకటించింది. ఈ ప్రాంతం నుండి యుఎస్ $4 ట్రిలియన్ల వరకు పెట్టుబడులను సేకరించవచ్చని ఆయన చెప్పారు.
ఎతిహాద్ $14.5 బిలియన్ల బోయింగ్ ఒప్పందం
బోయింగ్, GE ఏరోస్పేస్ GE ఇంజిన్లతో నడిచే 28 బోయింగ్ విమానాలను.. ముఖ్యంగా 787, 777X - కొనుగోలు చేయడానికి ఎతిహాద్ నుండి $14.5 బిలియన్ల ఆర్డర్లు చేసినట్లు వైట్ హౌస్ ధృవీకరించింది. ఈ ప్రకటన యూఎస్-యూఏఈ మధ్య $200 బిలియన్లకు పైగా వాణిజ్య ఒప్పందాలలో ఇది భాగమని యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం వెల్లడించారు.
"తదుపరి తరం 777X ను దాని విమానాల ప్రణాళికలో చేర్చడంతో, యూఏఈ- యునైటెడ్ స్టేట్స్ మధ్య దీర్ఘకాలిక వాణిజ్య విమానయాన భాగస్వామ్యాన్ని మరింతగా పెంచుతుంది. అమెరికన్ తయారీకి ఇది దోహదం చేస్తుంది." అని వైట్ హౌస్ తెలిపింది.
ఎతిహాద్ CEO ఆంటోనోల్డో నెవ్స్ గత నెలలో మాట్లాడుతూ.. 2030 నాటికి తన విమానాల సంఖ్యను 170 కంటే ఎక్కువ విమానాలకు విస్తరించాలని, అబుదాబి ఆర్థిక వైవిధ్యీకరణ వ్యూహాన్ని పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నందున, ఈ సంవత్సరం 20 నుండి 22 కొత్త విమానాలను జోడించాలని ఎతిహాద్ ప్రణాళిక వేసిందని చెప్పారు.
తాజా వార్తలు
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్







