అమర్నాథ్ యాత్రలో చిక్కుకున్న 150 మంది తెలుగు యాత్రికులు
- July 10, 2016
అమర్నాథ్ యాత్రలో తెలుగు యాత్రికులు చిక్కుకున్నారు. యాత్ర నుంచి తిరుగు ప్రయాణంలో బాల్తాల్ వద్ద 150 మంది యాత్రీకులు చిక్కుకుపోయినట్లు సమాచారం. అయితే... వీరంతా ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు చెందిన వారుగా గుర్తించారు. కాగా... విదేశీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి ఈ విషయం తెలవడంతో ఆయన అధికారులను అప్రమత్తం చేశారు. వారు సురక్షితంగా రాష్ట్రానికి తిరిగి వచ్చేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. అలాగే రాష్ట్ర రవాణా శాఖ మంత్రి శిద్దా రాఘవరావు యాత్రికులతో ఫోన్లో మాట్లాడారు. యాత్రికులను క్షేమంగా తీసుకురావడానికి ఏర్పాట్లు చేయాలని ఢీల్లీలోని ఏపీ భవన్ రెసిడెంట్ అధికారి శ్రీకాంత్‌ను మంత్రి రాఘవరావు ఆదేశించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







