కెన్యాకు బయలుదేరిన మోడీ

- July 10, 2016 , by Maagulf
కెన్యాకు బయలుదేరిన మోడీ

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన టాంజానియా పర్యటన ముగించుకుని కెన్యా బయలుదేరి వెళ్లారు. టాంజానియాలో ఆయనకు అక్కడి నేతలు, అధికారులు ఘనంగా వీడ్కోలు పలికారు. ఇవాళ ఆయన టాంజానియాలో ఆ దేశ అధ్యక్షుడితో సమావేశమై భారత్, టాంజానియా ధ్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. ఐదు ఒప్పందాలపై సంతకాలు కూడా జరిగాయి. అనంతరం ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొని తదుపరి పర్యటన కోసం కెన్యాకు పయనమయ్యారు. కాగా, మోదీ తన నాలుగు ఆఫ్రికా దేశాల పర్యటనలో భాగంగా మొజాంబిక్, దక్షిణాఫ్రికా, టాంజానియాల్లో పర్యటించారు. చివరగా కెన్యా పర్యటన ముగించుకుని భారత్‌కు రానున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com