నంబర్ ప్లేట్ లేకుండా జీప్ నడుపుతున్న యువ డ్రైవర్ అరెస్ట్
- July 10, 2016
ఈద్ రోజులలో తెల్లవారుజాము సమయంలో నంబర్ ప్లేట్ లేకుండా నంతోంగ్ మఖ్రం నివాస ప్రాంతంలో నిర్లక్ష్యంగా జీప్ ని డ్రైవింగ్ చేస్తున్న 21 ఏళ్ళ యువ వాహన చోధకుడిని అబూ ధాబీ గస్తీ పోలీసులు అరెస్ట్ చేశారు. ' ఎమరాత్ అల్ యుం ' గా గుర్తించబడిన ఈ యువకుడు ఎమిరేట్ వాసి. తన విపరీతమైన డ్రైవింగ్ చేష్టలతో తన ఇరుగు పొరుగు వారిని సైతం కలవరం కల్గించి ఇబ్బందులు పెట్టినట్లు, ఇతరుల జీవితాలని పణంగా పెట్టి ఆ ప్రాంతంలో పెద్ద ముప్పుగా మారినట్లు అతనిపై అభియోగాలు నమోదు కాబడ్డాయి. అబూధాబీ పోలీస్ కేంద్ర ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ బ్రిగేడియర్ ఆలీ ఖలీఫాన్ అల్ దహెరి ఈ సందర్భంగా మాట్లాడుతూ, ట్రాఫిక్ గస్తీ లో ఆ యువకుడ్ని అనుసరించామని ఈ డ్రైవర్ చేసిన ఒక ట్రాఫిక్ ఉల్లంఘన గమనించి అతన్ని ఆపేందుకు ప్రయత్నించామని కానీ ఆ యువకుడు తన వాహనాన్ని ఆపేందుకు నిరాకరించాడని మాకు దొరకకుండా వేగంగా మమ్ముల్ని తప్పించుకునేందుకు విపరీతంగా ప్రయత్నించాడని అఆయన తెలిపారు. బ్రిగేడియర్ అల్ దహెరి ఇటువంటి ప్రవర్తన కల్గిన డ్రైవర్ వలన ఇతరుల భద్రతకి ముప్పు గా మారేడని అన్నారు.ఈ యువకుడి చర్యలు అంగీకరించడం తమకు సాధ్యం కాదని అతని నేరంకు అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉందని పోలీస్ అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- నోబెల్ విజేతలకు రూ.11.52 కోట్లు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!
- అరేబియా గల్ఫ్‌లో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!
- సౌదీలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం..!!
- సముద్ర భద్రతకు ప్రాధాన్యం.. లాటిన్ అమెరికాతో గల్ఫ్ దేశాల కొత్త బంధం..!!
- మానవ అక్రమ రవాణా నిరోధంలో ఒమన్ కీలక చర్యలు..!!
- రియాద్ విమానాశ్రయం పై దాడి.. 12 మంది మృతి, 309 మందికి గాయాలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..







