నిషేధిత పిల్స్ రవాణా.. ఇద్దరికి 200,000 దిర్హామ్‌ల జరిమానా, 7 ఏళ్ల జైలుశిక్ష..!!
- May 17, 2025
యూఏఈ: 1,200 నిషేధిత మాదకద్రవ్య పిల్స్ ను యూఏఈలోకి అక్రమ రవాణా చేసినందుకు ఇద్దరు ఆఫ్రికన్ జాతీయులకు ఏడు సంవత్సరాల జైలు శిక్ష, ఒక్కొక్కరికి 200,000 దిర్హామ్‌ల జరిమానా విధించారు. దుబాయ్ కోర్టు ఆఫ్ ఫస్ట్ ఇన్‌స్టాన్స్ కూడా శిక్ష అనుభవించిన తర్వాత ఇద్దరిని (ఒక పురుషుడు, ఒక స్త్రీ) బహిష్కరించాలని ఆదేశించింది.
దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ ఇన్స్పెక్టర్ రొటీన్ స్క్రీనింగ్ సమయంలో ప్రయాణీకుల లగేజీలో అనుమానిత పదార్థాలను గుర్తించి కేసు నమోదు చేసారు. మాన్యువల్ సెర్చ్ లో నియంత్రిత మాదకద్రవ్యాలుగా అనుమానించిన పిల్స్ పెద్ద మొత్తంలో బయటపడ్డాయి.
దుబాయ్ పోలీసులు ప్రయాణీకుడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణ సమయంలో.. తన స్వదేశంలో ఒక వ్యక్తి బ్యాగ్‌ను తనకు ఇచ్చాడని, విమానాశ్రయంలో వేచి ఉన్న ఒక మహిళకు డెలివరీ చేయాలని చెప్పారని, అందులో ఆహార పదార్థాలు ఉన్నాయని వాళ్లు చెప్పారని తెలిపాడు. రెండవ నిందితురాలితో జరిపిన వాట్సాప్ మెసేజులను కూడా అతను చూపించాడు.
ఈ సమాచారం ఆధారంగా అధికారులు ఆ మహిళ అరెస్టు చేశారు. ఆమె తన సోదరుడి తరపున బ్యాగ్‌ను తీసుకోవడానికి విమానాశ్రయంలో ఉన్నట్లు ఒప్పుకుంది. కానీ దానిలోని పిల్స్ గురించి తనకు తెలియదని నిరాకరించింది.
స్వాధీనం చేసుకున్న మాత్రలను యూఏఈ మాదకద్రవ్యాల నిరోధక చట్టం ప్రకారం.. నియంత్రిత పదార్థాలుగా వర్గీకరించారని ఫోరెన్సిక్ విశ్లేషణ నిర్ధారించింది. నిషేధిత పిల్స్ ను పంపిణీ చేయాలనే ఉద్దేశ్యంతో దిగుమతి చేసుకుని, కలిగి ఉన్నందుకు నిందితులిద్దరినీ కోర్టు దోషులుగా నిర్ధారించింది.
తాజా వార్తలు
- ఇరాన్ దాడుల అనంతరం కతార్‌లో ఇండియన్ ఎంబసీ హెచ్చరిక
- ఎయిర్ ఇండియా మిడిల్ ఈస్ట్ విమానాలను నిలిపివేత
- నివాసితులను అప్రమత్తంగా ఉండాలని కోరిన దుబాయ్ సెక్యూరిటీ సర్వీస్
- కతార్ పై మిసైల్ దాడిని తీవ్రంగా ఖండించిన GCC ప్రధాన కార్యదర్శి
- బహ్రెయిన్ వైమానిక పరిధిని తాత్కాలికంగా నిలిపివేత
- కువైట్ తాత్కాలికంగా వైమానిక పరిధి మూసివేత
- శ్రీవారి లడ్డూ ప్రసాదం కొనుగోలుకు నూతన సదుపాయం
- ఆర్టీసీ సిబ్బందిపై దాడులకు పాల్పడితే చట్టపరమైన చర్యలు: ఎండీ వీసీ సజ్జనర్
- భారత్‌కి క్రూడాయిల్ విషయంలో ఇబ్బంది లేదు: హర్దీప్ సింగ్
- చెన్నై పోలీసుల అదుపులో హీరో శ్రీరామ్..