ఒహియోలో మెరిసిన సౌదీ విద్యార్థులు..23 అవార్డులు సొంతం..!!

- May 17, 2025 , by Maagulf
ఒహియోలో మెరిసిన సౌదీ విద్యార్థులు..23 అవార్డులు సొంతం..!!

కొలంబస్, ఒహియో: మే 10–16 వరకు ఒహియోలోని కొలంబస్‌లో జరిగిన రెజెనెరాన్ ఇంటర్నేషనల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఫెయిర్ (ISEF 2025)లో సౌదీ జాతీయ జట్టు 14 గ్రాండ్ బహుమతులు, తొమ్మిది ప్రత్యేక అవార్డులతో సహా 23 అవార్డులను గెలుచుకుంది. ఈ పోటీలో 70 దేశాల నుండి 1,700 మందికి పైగా పాల్గొన్నారు. ముగ్గురు సౌదీ విద్యార్థులు రెండవ స్థానంలో, ఐదుగురు మూడవ స్థానంలో, ఆరుగురు వివిధ శాస్త్రీయ విభాగాలలో నాల్గవ స్థానంలో గౌరవాలను పొందారు. ఈ అవార్డులు సైన్స్, ఆవిష్కరణలలో సౌదీ అరేబియాలో  పెరుగుతున్న వృద్ధిని తెలియజేశాయని అధికారులు తెలిపారు.  ఈ సంవత్సరం ప్రతినిధి బృందంలో శక్తి, పర్యావరణ ఇంజనీరింగ్, వైద్య శాస్త్రాలు వంటి రంగాలలో అత్యాధునిక ప్రాజెక్టులను ప్రదర్శించే 40 మంది విద్యార్థులు ఉన్నారు. 2007లో మొదటిసారి పాల్గొన్నది. అప్పటి నుండి సౌదీ అరేబియా ISEFలో సాధించిన మొత్తం పతకాల సంఖ్య 183 కు చేరుకుంది.  వీటిలో 124 గ్రాండ్ బహుమతులు , 59 ప్రత్యేక అవార్డులు ఉన్నాయి.

కింగ్ అబ్దులాజీజ్ మరియు హిజ్ కంపానియన్స్ ఫౌండేషన్ ఫర్ గిఫ్టెడ్‌నెస్ అండ్ క్రియేటివిటీ (మావిబా) యాక్టింగ్ సెక్రటరీ జనరల్ డాక్టర్ ఖలీద్ అల్-షరీఫ్ మాట్లాడుతూ.. ఈ విజయం మావిబా, విద్యా మంత్రిత్వ శాఖ, ఇతర జాతీయ భాగస్వాముల మధ్య వ్యూహాత్మక సహకారం ఫలితంగా వచ్చిందన్నారు. యువ ప్రతిభను పెంపొందించడంలో సౌదీ అరేబియా ముందువరుసులో ఉంటుందని పేర్కొన్నారు.

ఇక రెండవ స్థానంలో నిలిచిన వారిలో మరియం అల్-ముహైష్(ఎనర్జీ) , పర్యావరణ ఇంజనీరింగ్‌లో అరీజ్ అల్-కర్ని మరియు జివాన్ షాబీ ఉన్నారు. మూడవ స్థానంలో నిలిచిన విజేతలు జుమానా బిలాల్ (ఎనర్జీ), సల్మాన్ అల్-షాహ్రీ, లానా నౌరీ (వైద్య శాస్త్రం), లామియా అల్-నెఫై (పర్యావరణ ఇంజనీరింగ్), ఫాతిమా అల్-ముతబాగాని (ప్లాంట్ సైన్సెస్).. నాల్గవ స్థానంలో నిలిచిన వారిలో హనీన్ అల్-హసన్,  ఒమ్రాన్ అల్-టర్కిస్తానీ (ఎనర్జీ), ఫాతిమా అల్-అర్ఫాజ్, మిస్క్ అల్-ముతైరీ (కెమిస్ట్రీ), అబీర్ అల్-యూసెఫ్ (మెటీరియల్స్ సైన్స్), ఘలా అల్-ఘమ్డి (ప్లాంట్ సైన్సెస్) ఉన్నారు. ప్రత్యేక అవార్డు గ్రహీతలలో ఫాతిమా అల్-అర్ఫాజ్, అరీజ్ అల్-ఖర్నీ, సలేహ్ అల్-అంగారి, అబ్దుల్‌రహ్మాన్ అల్-ఘన్నామ్, సామా బుఖమ్‌సీన్ ఇతరులు ఉన్నారు. అనేక మంది విద్యార్థులు ఒకటి కంటే ఎక్కువ అవార్డులను అందుకున్నారు.

ISEF ప్రపంచంలోనే అతిపెద్ద ప్రీ-కాలేజ్ సైన్స్ పోటీగా గుర్తింపు పొందింది.  ప్రముఖ శాస్త్రవేత్తలు, పరిశ్రమ నిపుణుల బృందం ప్రాజెక్టులను పరిశీలించి, విశ్లేషించి అవార్డులను అందజేస్తారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com