వింబుల్డన్‌ పురుషుల సింగిల్స్‌ టైటిల్‌ను కైవశం చేసుకున్న ముర్రే

- July 10, 2016 , by Maagulf
వింబుల్డన్‌ పురుషుల సింగిల్స్‌ టైటిల్‌ను కైవశం చేసుకున్న ముర్రే

వింబుల్డన్‌ పురుషుల సింగిల్స్‌ టైటిల్‌ను బ్రిటన్‌ స్టార్‌ ఆండీముర్రే గెలుచుకున్నాడు. ప్రత్యర్థి గట్టి పోటీనిచ్చినప్పటికీ వరుస సెట్లలో పైచేయి సాధించాడు. దీంతో రెండో సీడ్‌ ముర్రే ఫైనల్‌లో 6-4, 7-6, 7-6 తేడాతో కెనడాకు చెందిన ఏడో సీడ్‌ రోనిచ్‌పై విజయం సాధించాడు. ఈ బ్రిటన్‌ స్టార్‌కు ఇది రెండో వింబుల్డన్‌ సింగిల్స్‌ టైటిల్‌కాగా కెరీర్‌లో మూడో గ్రాండ్‌స్లామ్‌. 2012లో యూఎస్‌ ఓపెన్‌, 2013లో తొలిసారి వింబుల్డన్‌ టైటిల్‌ నెగ్గాడు. ప్రత్యర్థిపై టైటిల్‌ సాధించిన ఆనందంలో ముర్రే వెంటనే ఉద్వేగానికిలోనై కంటతడిపెట్టాడు. మరోవైపు కెనడా తరపున తొలిసారి గ్రాండ్‌స్లామ్‌ సింగిల్స్‌ టైటిల్‌ నెగ్గాలన్న రోనిచ్‌ కలనెరవేరలేదు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com