ఆమ్‌స్టర్‌ డామ్‌లా తరహాలో అమరావతి

- July 10, 2016 , by Maagulf
ఆమ్‌స్టర్‌ డామ్‌లా తరహాలో అమరావతి

ఆటుపోట్లు తట్టుకొని ప్రగతి పథం దిశగా పయనం అక్కడ పడవలే ప్రధాన రవాణా వ్యవస్థ నవ్యాంధ్ర రాజధానికి మార్గదర్శనం విజయవాడ వ రల్డ్‌ క్లాస్‌ బిల్డింగ్స్‌ ఇక్కడ ఎక్కువగా ఉన్నాయంటే నమ్మశక్యం కాదు. ఈ గొప్ప విజయాన్ని అక్కడి పాలకులు ఎలా సాధించారు..? ఆ విజయ రహస్యం ఏమిటో మనమూ తెలుసుకుందాం.
కృషి ఉంటే మట్టిలో నుంచి బంగారాన్ని వెలికి తీయవచ్చంటారు పెద్దలు. నెదర్లాండ్స్‌ దేశ రాజధాని ఆమ్‌స్టర్‌డ్యామ్‌కు ఇది అక్షరాలా వర్తిస్తుంది. సరిగ్గా 50 ఏళ్ల కిందట ఈ దేశం ఎన్నో పెను సవాళ్లను ఎదుర్కొంది. చినుకు పడితే చావే గతి అన్నట్టుండేది ఆ నగర వాసుల పరిస్థితి.. అదేంటి వర్షాలు పడితే చక్కని పంటలు పండి అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించవచ్చు కదా అంటే.. నిజమే కానీ, ఆమ్‌స్టర్‌డామ్‌కు మాత్రం వర్షం ఒక శాపం లాంటిది. అయితే ఆ కష్టాలనే మెట్లుగా చేసుకుని వారు అభివృద్ధిలో దూసుకెళ్లారు. నదీ తీర ప్రాంత నగరాల్లో మేటిగా ఆమ్‌స్టర్‌డ్యామ్‌ను తీర్చిదిద్దారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతికి ఆ నగర ప్రస్థానం స్ఫూర్తిగా నిలవనుంది.
ఆమ్‌స్టర్‌డామ్‌ నగరం సముద్ర మట్టానికి 45 అడుగుల లోతులో ఉంది. నదీ పరీవాహానికి రెండు అడుగులు మాత్రమే ఎత్తులో ఉంది. ఇదే అసలు ఎదురుదెబ్బ. గట్టిగా వర్షం కురిస్తే నగరంలో పడే నీరు నదిలోకి చేరేది కాదు. రాజధాని చుట్టుపక్కల వర్షాలు అధికంగా కురిస్తే సముద్రం ఆటుపోట్లు ఎదుర్కొని నగరాన్ని ముంచెత్తేంది. సరిగ్గా అయిదు దశాబ్దాల కిందట చేపట్టిన ఆ నగర నిర్మాణం కూడా ప్రణాళిక లేకుండా సాగింది. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో వర్షాలు పడి వారం రోజులు గడిచినా నీరు ఎటూ పోయేది కాదు. నగరం బురదలో కూరుకుపోయేది. ఫలితంగా జనజీవనం అస్తవ్యస్తంగా మారి.. ప్రజల జీవన పరిణామాలు మెరుగుపరచ¿ం అలా ఉంచితే కరువు వెన్నాడుతుండేది. అలాంటి ఈ నగరం నేడు ప్రపంచంలో అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో ఒకటిగా కీర్తికెక్కింది.
వెలుగులు నింపిన సాంకేతికత నెదర్లాండ్స్‌ రాజధాని ఆమ్‌స్టర్‌డామ్‌ మన విజయవాడ నగరం కంటే చాలా చిన్నది. నగరానికి ఒకపక్క నది. మరో పక్క సముద్రం ఉంది. 2011 సంవత్సరం నాటి లెక్కల ప్రకారం అక్కడ జనాభా 7.79 లక్షలు మాత్రమే. అయిదు దశాబ్దాల కిందట విద్య, ఆర్థిక, సాంకేతిక పరంగా వెనుకబడిన ఈ దేశం అంతకంతకూ మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆయుధంగా చేసుకుని ముందడుగు వేసింది.
పునఃనిర్మాణంలో కలిసొచ్చిన అదృష్టం కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు పుడతాడనే సామెత మాదిరి.. అస్తవ్యస్తంగా ఉన్న ఆమ్‌స్టర్‌డామ్‌ నగరాన్ని ప్రక్షాళన చేయాలని భావించిన ప్రభుత్వాలు ఆ దిశగా ముందుకు సాగాయి. నగరంలో ప్రధానంగా సమస్యగా మారిన ఆక్రమణలను ఏరివేత చేపట్టింది. రహదార్ల విస్తరణ పెద్ద ఎత్తున జరిగింది. డ్రైవ్‌లో అనుకోకుండానే కాలువలు ఏర్పడ్డాయి. ఇదే వారికి కలిసి వచ్చిన అదృష్టంగా చెప్పకోవచ్చు. నది కంటే నగరం కాస్తంత ఎత్తు పెరిగింది. వర్షపునీరు కాలవల్లోకి చేరడం మొదలు పెట్టింది. ముందపు సమస్య నుంచి ప్రజలు 50 శాతం ఉపశమనం పొందారు. నదీ పరీవాహకంలో అతి పెద్ద రిటైనింగ్‌ వాల్స్‌ నిర్మాణాలు జరిగాయి. కాలానుగుణంగా రాజధానితో పాటు ఆ దేశమంతా నగరాల ప్రక్షాళనలు జరిగాయి. ఇప్పుడు అక్కడి ప్రజలకు ప్రధాన రవాణా మార్గం కాలువలే. నగర పునఃనిర్మాణంలో ఏర్పడిన కాలవలను మరింత లోతు తీసి వాటిని సుందరీకరించారు. ప్రపంచీకరణ నేపథ్యంలో ఇప్పుడు వారు బోటు కార్లపై ప్రయాణాలు చేస్తున్నారు. మన రహదార్లపై నడిచే కార్ల వేగంతో పడవలు పోటీ పడడం విశేషం. ప్రస్తుతం రాజధాని నగరంలో ముంపు సమస్య పూర్తిగా మటుమాయమైపోయింది.
స్వచ్ఛ నగరం ఆమ్‌స్టర్‌డామ్‌లో పర్యావరణ పరిరక్షణకు ప్రథమ స్థానాన్ని కల్పిస్తారు. నగరంలో ఎటుచూసినా చెట్ల పెంపకం అధికంగా కనిపిస్తుంది. రోడ్లపై ఎక్కడా చిన్న కాగితం ముక్క కూడా కనిపించదు. ప్లాస్టిక్‌ లాంటి కాలుష్య కారకాలను నియంత్రణ విషయంలో ప్రభుత్వం క్రమ పద్ధతిని ఏర్పాటు చేసింది. రవాణాకు పడవలను వినియోగించడం ద్వారా కాలుష్యం ఉండదు. పడవలకు ప్రయాణ ఛార్జీలు కూడా చాలా తక్కువగా విధించడం ద్వారా జనాభా ఎక్కువగా వీటినే ఆశ్రయిస్తున్నారు.
నవ్యనగరికి ఆదర్శంగా.. ఆమ్‌స్టర్‌డామ్‌కు గతంలో ఉన్న సమస్య మన నూతన రాజధాని అమరావతికి కూడా పొంచి ఉంది. ఓ పక్క కృష్ణానది, కొండవీటి వాగులు భవిష్యత్తులో ఇబ్బందులు కలిగించే అవకాశాలు ఉన్నాయి. కృష్ణానదికి వరద నీరు వస్తే రాజధానికి కొంత ఇబ్బంది కలిగే అవకాశాలు లేకపోలేదు. కొండవీటి వాగు కూడా పొంగే ఇబ్బందులు ఉన్నాయి. ఇటీవల నెదర్లాండ్స్‌ ప్రతినిధులు ఏపీ సీఆర్డీఏ అధికారులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. మన రాజధాని బృహత్తర ప్రణాళికను చూసి ఆశ్చర్యచకితులయ్యారు. అమరావతి భవిష్యత్తులో మరో ఆమ్‌స్టర్‌డ్యామ్‌ కాబోతుందని జోస్యం చెప్పారు. అయితే వారు కృష్ణానది, కొండవీటి వాగు ముంపు నివారణ విషయంలో వారు తీసుకున్న జాగ్రత్తలను మన అధికారులకు దృశ్యమాద్యమాల ద్వారా వివరించి దిశా నిర్దేశం చేసి వెళ్లారు.
కాలానుగుణంగా వచ్చిన మార్పులు ఆమ్‌స్టర్‌డామ్‌ అభివృద్ధి రోజు రోజుకూ కొత్త పుంతలు తొక్కుతోంది. సహజ సిద్ధంగా కురిసిన వర్షపునీటిని అక్కడి ప్రజలు ఒక్క నీటి బొట్టును కూడా వృథా చేయరు. పట్టణాభివృద్ధి సంస్థ ప్రతి వీధిలో వరద ట్రీట్‌మెంట్‌ ప్లాట్లను నెలకొల్పింది. దీని ద్వారా వర్షపు నీటిని దాచుకొని వాటిని శుద్ధి చేసి ప్రజల వినియోగానికి సరఫరా చేస్తుంటారు. ఇకపోతే తుపానులు వచ్చినప్పుడు ఎక్కడైనా ముంపు సమస్య ఉంటే వాటికి కూడా చక్కటి జాగ్రత్తలు తీసుకున్నారు. లోతట్టు ప్రాంతాల్లో భారీ మోటార్లు ఉంటాయి. వర్షపు నీరు అధికంగా చేరితే మోటార్ల సాయంతో నదిలోకి పంపిస్తారు. ఇక నగరంలో 30కి పైగా వర్మీ కంపోస్టు ప్లాంట్లు ఉన్నాయి. వీటి ద్వారా వచ్చే ఎరువులను పంటలకు వినియోగిస్తున్నారు. వ్యర్థ జలాలను సైతం పరిశుభ్రం చేసి
నదిలోకి వదులుతున్నారు. ఆమ్‌స్టర్‌ డామ్‌ ఓ చక్కని పర్యాటక ప్రాంతంగా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే మన దేశంలోని కేరళ రాష్ట్రాన్ని తలపిస్తుంది. పర్యాటక నగరంగా తీర్చిదిద్దేందుకు నగరంలో ఏడు అతి పెద్ద దీవులను ఏర్పాటు చేశారు. ఇదెలా సాధ్యం అనుకుంటున్నారా.. మట్టిని పెద్ద ఎత్తున నదిలో పోసి అందమైన దీవులుగా తీర్చిదిద్దారు. ఈ ఏడు లింకు దీవులుగా ఉండటం ఒక ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com