వార్ 2 టీజ‌ర్‌ వ‌చ్చేసింది..

- May 20, 2025 , by Maagulf
వార్ 2 టీజ‌ర్‌ వ‌చ్చేసింది..

టాలీవుడ్ యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్, బాలీవుడ్ హీరో హృతిక్‌ రోషన్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న మూవీ వార్ 2. అయాన్ ముఖ‌ర్జీ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. కియారా అద్వాణీ క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని య‌శ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తోంది. ఎన్టీఆర్‌, హృతిక్ క‌లిసి న‌టిస్తున్న ఈ మ‌ల్టీస్టార‌ర్ చిత్రం పై అభిమానుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి. ఆగ‌స్టు 14న ఈ మూవీ ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

మే 20న ఎన్టీఆర్ పుట్టిన రోజు సంద‌ర్భంగా యంగ్ టైగ‌ర్‌కు ఓ స‌ర్‌ప్రైజ్ ఉంటుంద‌ని స్వ‌యంగా హృతిక్ రోష‌న్ వెల్ల‌డించిన సంగ‌తి తెలిసిందే. దీంతో ఫ్యాన్స్ అంతా ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తుండ‌గా.. తాజాగా వార్ 2 టీజ‌ర్‌ ను విడుద‌ల చేశారు.

ఒక నిమిషం 34 సెక‌న్లు ఈ టీజ‌ర్ ఉంది. ‘నా క‌ళ్లు నిన్ను ఎప్ప‌టి నుంచో వెంటాడుతున్నాయి క‌బీర్..’ అని ఎన్టీఆర్ వాయిస్ ఓవ‌ర్‌తో టీజ‌ర్ ప్రారంభ‌మైంది. యాక్ష‌న్ స‌న్నివేశాలు అదిరిపోయాయి. ఇక ఎన్టీఆర్‌, హృతిక్ మ‌ధ్య వ‌చ్చే ఫైటింగ్ టీజ‌ర్‌కే హైలెట్ అని చెప్ప‌వ‌చ్చు.మొత్తంగా టీజ‌ర్ ఈ సినిమా పై అంచ‌నాల‌ను పెంచేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com