యూఏఈని ముంచెత్తిన వర్షాలు..వేడి నుంచి ఉపశమనం..!!
- March 11, 2026
యూఏఈ: యూఏఈ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షాలు ముంచెత్తాయి. దీంతో రోడ్లపై వర్షం నీరు నిలిచింది. రస్ అల్ ఖైమాలోని జైస్ పర్వతంలో ఉష్ణోగ్రతలు 11.6°C కనిష్ట స్థాయికి పడిపోయాయి.
ఈ మేరకు స్టార్మ్ సెంటర్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. వర్షాలకు సంబంధించిన పలు వీడియోలు, ఫోటోలను షేర్ చేసింది.
అబుదాబి, దుబాయ్ మరియు షార్జాలోని కొన్ని ప్రాంతాలలో ఇటీవల పెరుగుతున్న ఉష్ణోగ్రతల నుండి ప్రజలు, నివాసితులకు ఉపశమనం కలిగించిందని పేర్కొంది.
అబుదాబిలోని షేక్ జాయెద్ గ్రాండ్ మసీదు, షార్జాలోని మడమ్ ప్రాంతంలో కురిసిన వర్షానికి రోడ్లు పొంగిపొర్లాయి.
దుబాయ్ లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. ఈరోజు రాత్రి మరియు గురువారం ఉదయం కొన్ని తీరప్రాంత మరియు అంతర్గత ప్రాంతాలలో వర్షాలు కురిసే అవకాశం ఉందని స్టార్మ్ సెంటర్ తెలిపింది.
ఇక అబుదాబిలో ఉష్ణోగ్రతలు 30°C, దుబాయ్‌లో 29°C మరియు షార్జాలో 28°C వరకు పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. అదే సమయంలో వరుసగా 20°C, 21°C మరియు 20°C కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది.
ఎమిరేట్ వ్యాప్తంగా తేలికపాటి నుండి మితమైన గాలులు వీస్తాయని పేర్కొంది. అరేబియా గల్ఫ్‌లో సముద్రం మధ్యస్థం నుండి స్వల్పంగా మరియు ఒమన్ సముద్రం కొన్నిసార్లు ఉధృతంగా ఉండవచ్చని స్టార్మ్ సెంటర్ తన ప్రకటనలో వెల్లడించింది.
తాజా వార్తలు
- స్థానిక ఎన్నికల పై జగన్ ఫోకస్.. అభ్యర్థుల ఎంపిక పై కీలక ఆదేశాలు
- 476 మంది స్కూల్ బస్సు డ్రైవర్లు, సూపర్వైజర్లకు దుబాయ్ పోలీసుల శిక్షణ
- అల్ వుస్తా, సౌత్ అల్ షర్కియా గవర్నరేట్లలో సుల్తాన్ పర్యటన..!!
- ఖతార్‌లో ఇంటర్నేషనల్ స్పేస్ వీక్ 2026..!!
- బహ్రెయిన్‌లో అక్టోబర్ 9న ‘ట్రిబ్యూట్ టు బహ్రెయిన్’..!!
- కువైట్‌లో 77 సంస్థలకు ఫైర్ సేఫ్టీ హెచ్చరికలు..!!
- దుబాయ్ డ్యూటీ ఫ్రీలో $1 మిలియన్ గెలిచిన భారతీయుడు..!!
- GCC-ASEAN మధ్య ఆర్థిక, వాణిజ్య సహకార విస్తరణపై చర్చలు..!!
- భారీ వర్షాలు..అధికారులను అప్రమత్తం చేసిన సీఎం చంద్రబాబు!
- హైదరాబాద్ విమానాశ్రయం–బ్రస్సెల్స్ విమానాశ్రయం మధ్య అవగాహన ఒప్పందం







