చెరిత్ర తిరగ రాసిన పోర్చుగల్

- July 10, 2016 , by Maagulf
చెరిత్ర తిరగ రాసిన పోర్చుగల్

యూరో కప్ లో పోర్చుగల్ చరిత్ర సృష్టించింది. ఆతిథ్య జట్టు ఫ్రాన్స్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో విజయం సాధించి పోర్చుగల్ తొలిసారి యూరోకప్ ను అందుకుంది. ఇరుజట్లు హోరాహోరీగా తలపడిన ఫైనల్ మ్యాచ్ లో సబ్ స్టిట్యూట్ గా వచ్చిన పోర్చుగల్ ఆటగాడు ఏడర్.. అదనపు సమయంలో గోల్ కొట్టి తమ దేశానికి మరపురాని విజయాన్ని అందించాడు. స్టార్ ఆటగాడు క్రిస్టియన్ రొనాల్డో గాయంతో ఫస్ట్ ఆఫ్ లోనే మైదానాన్ని వీడినా పోర్చుగల్ మాత్రం ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ఆడింది. యూరోకప్ విజయంతో పోర్చుగల్ అభిమానులు సంబరాల్లో మునిగితేలుతున్నారు.

2004 యూరోకప్ లో ఆతిథ్య జట్టుగా ఫైనల్ కు చేరిన పోర్చుగల్.. 1-0 గోల్స్ తేడాతో గ్రీస్ చేతిలో ఓటమిపాలైంది. ఇప్పుడు మాత్రం ఆతిథ్య జట్టు ఫ్రాన్స్ ను అదే స్కోరుతో ఓడించి పోర్చుగల్ యూరోకప్ కలను నెరవేర్చుకోవటం విశేషం. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com