అతి వేగం: ఒకరి మృతి, ఇద్దరికి గాయాలు
- July 10, 2016
35 ఏళ్ళ ఎమిరేటీ వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. మరో ఇద్దరు ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ స్ట్రీట్‌లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారు నడుపుతున్న వ్యక్తి కంట్రోల్ తప్పడంతో, అతి వేగంతో ఉన్న కారు ప్రమాదానికి కారణమయ్యింది. ప్రమాద సమాచారం అందగానే పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకున్నారు. ఘటనా స్థలంలోనే ఓ వ్యక్తి మృతి చెందగా, ఆ మృతదేహాన్ని అజ్మన్‌లోని ఖలీఫా హాస్పిటల్‌కి తరలించారు. మరో ప్రమాదంలో డీజిల్ ట్రక్, ఎమిరేట్స్ రోడ్‌పై ప్రమాదానికి గురయ్యింది. ఈ ప్రమాదంతో రహదారిపై ట్రాఫిక్ భారీగా స్తంభించింది. రోడ్లపై వేగాన్ని తగ్గించుకోవాలనీ, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వాహనాలు నడపాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







