ఎన్‌టీఆర్‌తో నటించిన ఉమా భారతి తెలుగు ప్రజలందరికీ ప్రీతిపాత్రురాలు

- May 20, 2025 , by Maagulf
ఎన్‌టీఆర్‌తో నటించిన ఉమా భారతి తెలుగు ప్రజలందరికీ ప్రీతిపాత్రురాలు

హైదరాబాద్: యమగోల సినిమాలో మహానటుడు నందమూరి తారక రామారావు సరసన పాటలో నటించిన ఉమా భారతిని, తెలుగువారు ఎంతో అభిమానంతో గుర్తుచేసుకుంటున్నారు. ఆమె అమెరికాలో స్థిరపడ్డప్పటికీ, తెలుగువారి మధురస్మృతుల్లో నిలిచిపోయారు. ఉమా భారతి గురించి కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ సముద్రాల వేణుగోపాలాచారి ప్రశంసలు గుప్పించారు.

రవీంద్ర భారతిలోని సమావేశ మందిరంలో భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో వంశీ ఇంటర్నేషనల్, జె.వి. ప్రచురణలు నిర్వహించిన సభలో, సినీనటి, నృత్యగురువు, రచయిత్రి కోసూరి ఉమా భారతికి "వంశీ ఎన్టీఆర్ ప్రవాస భారతీయ పురస్కారం" అందజేశారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ వేణుగోపాలాచారి ఈ పురస్కారాన్ని బహూకరించి, విదేశాలలో స్థిరపడినప్పటికీ ఉమా భారతి తెలుగు భాషా, సాంస్కృతిక రంగాల్లో చేసిన కృషిని ప్రశంసించారు.

రామరాజు ఎన్టీఆర్ పేరిట పురస్కారానికి ఉమా భారతిని ఎంపిక చేయడం సముచితమని ఆయన పేర్కొన్నారు.

ఉమా భారతి రచించిన హృదయ గానం నవలపై మాట్లాడిన ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం మాజీ చైర్మన్ విజయ్ బాబు – ఆమె తేటతెలుగు భాషలో హృదయాన్ని స్పృశించే భావాలను రాగరంజితంగా ఆవిష్కరించారని అన్నారు.

నాట్య భారతీయం అంశాన్ని విశ్లేషించిన ప్రముఖ రచయిత్రి సమ్మెట్ విజయ–నాట్యం, సాహిత్యం, నటన మూడు రంగాల్లోని అనుభవాలతో ఉమా భారతి "భావ కదంబం"గా నిలిచారని వివరించారు.

సంతోష్ బాబు ఉమా భారతి రచించిన కథలు సుందరీ, నాగమణి, హృదయ గానం సంపుటులను విశ్లేషించారు. సభకు వంశీ రామరాజు అధ్యక్షత వహించగా, జ్యోతి వల్కభోజ్యుల కార్యక్రమ నిర్వహణ చేపట్టారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com