అల్ దహిరాలో నేషనల్ సర్వే జియోస్పేషియల్ ఇన్ఫర్మేషన్ అథారిటీ అవేర్నెస్ ప్రోగ్రామ్..!!
- May 21, 2025
ఇబ్రి: అల్ దహిరా గవర్నరేట్‌లో రక్షణ మంత్రిత్వ శాఖలోని నేషనల్ సర్వే, జియోస్పేషియల్ ఇన్ఫర్మేషన్ అథారిటీ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమం అల్ దహిరా గవర్నర్ షేక్ నజీబ్ అలీ అల్ రోవాస్ ఆధ్వర్యంలో జరిగింది.
ఇబ్రిలోని అల్ దహిరా గవర్నర్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో నేషనల్ సర్వే అండ్ జియోస్పేషియల్ ఇన్ఫర్మేషన్ అథారిటీ రోల్స్, బాధ్యతలతో పాటు వివిధ సంస్థలకు అందించే సేవలపై ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రత్యేక చర్చా సెషన్‌లను నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో నేషనల్ సర్వే, జియోస్పేషియల్ ఇన్ఫర్మేషన్ అథారిటీ అధిపతి బ్రిగేడియర్ నాసర్ అలీ అల్ హార్తీ, అల్ దహిరా గవర్నరేట్‌కు చెందిన వాలిస్, ప్రభుత్వ విభాగాల డైరెక్టర్ జనరల్‌లు, ప్రైవేట్ రంగం, గవర్నరేట్ మునిసిపల్ కౌన్సిల్ ప్రతినిధులు, జియోస్పేషియల్ డేటా నిపుణులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం..ఆరుగురు సజీవదహనం!
- తెలంగాణలో 4 రోజులు భారీ వర్షాల హెచ్చరిక
- ఫుజైరాలో విదేశీ మీడియా సంస్థ కోసం వీడియో షూట్..వ్యక్తి అరెస్టు..!!
- అక్రమ ఒబెసిటీ ఆపరేషన్స్..జెడ్డాలోని కేంద్రం సీజ్..!!
- Skytrax అవార్డులు, Expo నుండి వైదొలిగిన హమద్ ఎయిర్ పోర్ట్..!!
- ప్రాంతీయ పరిణామాలపై బహ్రెయిన్, జోర్డాన్ చర్చలు..!!
- ల్యాండ్ పోర్టుల ద్వారా నిరాటకంగా చేపల దిగుమతులు..!!
- వైమానిక దాడిలో ఇరాన్ భద్రతా చీఫ్ మృతి
- పర్యాటకులకు ఇష్టమైన ఈద్ విహార కేంద్రంగా ఒమన్..!!
- ప్రాంతీయ పరిణామాల పై యూఏఈ అధ్యక్షుడు, భారత ప్రధాని చర్చలు..!!









