జజీరా ఎయిర్‌వేస్‌తో వేసవి విహారయాత్రలు.. కేవలం KD19 నుండి ప్రారంభం..!!

- May 21, 2025 , by Maagulf
జజీరా ఎయిర్‌వేస్‌తో వేసవి విహారయాత్రలు.. కేవలం KD19 నుండి ప్రారంభం..!!

కువైట్: కువైట్లోని ప్రముఖ తక్కువ- ధర విమానయాన సంస్థ జజీరా ఎయిర్వేస్.. బహ్రెయిన్, ఇరాన్, జోర్డాన్, యుఎఇ, కెఎస్ఎ (జెడ్డా మరియు తైఫ్), ఖతార్లకు కేవలం KD 19 నుండి ప్రారంభమయ్యే వన్-వే ఛార్జీలను కలిగి ఉన్న ప్రత్యేకమైన పరిమిత ఆఫర్ ను ప్రకటించింది. ఇండియా, పాకిస్తాన్, నేపాల్, శ్రీలంకలకు KD 25 నుండి.. ఈజిప్ట్ కైరో, షర్మ్ ఎల్-షేక్, స్ఫింక్స్ కు KD 30 నుండి ప్రారంభమవుతాయి. లెబనాన్, ఒమన్, కజాఖాన్, కిర్గిజ్ఙాన్, జార్జియా, అర్మేనియాకు KD 29 నుండి ప్రారంభమవుతాయి. హంగేరీ, చెక్ రిపబ్లిక్ వంటి యూరోపియన్ గమ్యస్థానాలకు వన్- వే ఛార్జీలు KD 32 నుండి ప్రారంభమవుతాయి. మే 19 నుండి 22 వరకు బుకింగ్ కోసం తెరిచి ఉన్న ఈ సేల్ ఆగస్టు 31 వరకు ప్రయాణానికి చెల్లుబాటు అవుతుందని జజీరా ఎయిర్వేస్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ పాల్ కారోల్ తెలిపారు. ఈ ప్రత్యేక ఛార్జీలను పొందడానికి, జజీరా ఎయిర్వేస్ మొబైల్ యాప్ www.jazeeraairways.com లేదా 177 కు కాల్ చేయాలని సూచించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com