$5 మిలియన్ల ఒప్పందంపై కెఎస్ రిలీఫ్, UNDP సంతకాలు..!!

- May 21, 2025 , by Maagulf
$5 మిలియన్ల ఒప్పందంపై కెఎస్ రిలీఫ్, UNDP సంతకాలు..!!

బ్రస్సెల్స్: సిరియాలోని 14 గవర్నరేట్లలో ఎనిమిదింటిలో 33 బ్రెడ్ ఉత్పత్తి యూనిట్లను పునర్ ప్రారంభించడం ద్వారా ఆహార భద్రతను పెంపొందించడానికి కింగ్ సల్మాన్ హ్యుమానిటేరియన్ ఎయిడ్ అండ్ రిలీఫ్ సెంటర్ (కెఎస్ రిలీఫ్) సోమవారం ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (యుఎన్డిపి)తో 5 మిలియన్ల డాలర్ల ఉమ్మడి ప్రాజెక్టు ఒప్పందంపై సంతకం చేసింది.

బ్రస్సెల్స్‌లో జరిగిన యూరోపియన్ హ్యుమానిటేరియన్ ఫోరం 2025 సందర్భంగా యుఎన్‌డిపి నిర్వాహకుడు అచిమ్ స్టైనర్, కెఎస్ రిలీఫ్ జనరల్ సూపర్‌వైజర్ డాక్టర్ అబ్దుల్లా అల్-రబీహ్ ఈ ఒప్పందంపై సంతకం చేశారు. పునరావాస ప్రాజెక్టులో ప్రాథమిక పునరుద్ధరణ పనులు, కొత్త ఉత్పత్తి లైన్ల స్థాపన, మొబైల్ బ్రెడ్ ఉత్పత్తి యూనిట్ల పునరావాసం ఉన్నాయి. 

ప్రస్తుతం 12.4 మిలియన్లకు పైగా ప్రజలు, లేదా జనాభాలో 60 శాతం కంటే ఎక్కువ మంది పద్నాలుగు సంవత్సరాల సంఘర్షణ తర్వాత సిరియాలో ఆహార అభద్రతను ఎదుర్కొంటున్నారు. దాంతోపాటు బేకరీ రంగంలో 500 ఉద్యోగాలను సృష్టించడం, స్థానిక ఆర్థిక పునరుద్ధరణకు దోహదపడుతుందని భావిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com