ఆర్థిక సంబంధాల వృద్ధిపై సౌదీ అరేబియా, స్పెయిన్ ఒప్పందం..!!
- May 22, 2025
రియాద్: సౌదీ అరేబియా, స్పెయిన్ వాణిజ్య సంబంధాలలో కీలక ముందడుగు పడింది. రెండు దేశాల మధ్య నైపుణ్యాన్ని మార్పిడి చేసుకోవడానికి, ఆర్థిక సంబంధాలను పెంపొందించడానికి ఒక అవగాహన ఒప్పందం (MoU)పై సౌదీ అరేబియా, స్పెయిన్ సంతకం చేశాయి. ఈ అవగాహన ఒప్పందంపై సౌదీ ఆర్థిక, ప్రణాళిక మంత్రి ఫైసల్ అలీబ్రహీం.. స్పానిష్ ఆర్థిక, వాణిజ్య మరియు వ్యాపార మంత్రి కార్లోస్ క్యూర్పో కాబల్లెరో సంతకం చేశారు.
ఆర్థిక నమూనా, ఉమ్మడి భాగస్వామ్యాలు, కార్యక్రమాల ద్వారా చిన్న మరియు మధ్య తరహా సంస్థలకు (SMEలు) మద్దతు ఇవ్వడంతో ఆర్థిక కార్యక్రమాలలో ఉమ్మడి ప్రాజెక్టులు, ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని సులభతరం చేయడం వంటి సహకార రంగాలను ఈ ఒప్పందం వివరిస్తుంది. సౌదీ విజన్ 2030 లక్ష్యాలకు అనుగుణంగా పరిశ్రమ, సాంకేతికత, ఇన్నోవేషన్ వంటి రంగాలలో సమాచార మార్పిడిని కూడా ఇది కవర్ చేస్తుందన్నారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై తమ అభిప్రాయాలను షేర్ చేసుకున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ లో రెండు రోజుల్లోనే మ్యారేజ్ సర్టిఫికెట్..!!
- సలాలాలో ఒమన్ ట్రెడిషనల్ గేమ్స్ సీజన్ 2026 ప్రారంభం..!!
- భోగాపురం నుంచి తొలిరోజు 31 విమాన సర్వీసులు
- కొలంబియా భూకంప బాధితులకు యూఏఈ భారీ సాయం..!!
- ఖతార్‌లో వినియోగదారుల భద్రతకు పెద్దపీట..!!
- షేక్ జాయెద్ రోడ్డు పై మరో లేన్.. ట్రాఫిక్ తగ్గించేందుకు దుబాయ్ RTA చర్యలు
- విజయవాడ నుంచి వారణాసికి డైరెక్ట్ ఫ్లైట్..
- షార్జా బస్‌స్టాప్‌లలో రియల్‌టైమ్ బస్ రాక సమాచారం
- ఒమన్‌లో ట్యాంకర్ ప్రమాదం పై కొనసాగుతున్న పర్యవేక్షణ
- ఇంద్రకీలాద్రి పై కొత్త రూల్స్..







