దుబాయ్ లో పెరుగుతున్న మహిళా డ్రైవర్లు..తగ్గుతున్న యాక్సిడెంట్లు..!!
- May 22, 2025
దుబాయ్: దుబాయ్ లో మహిళా డ్రైవర్ల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఓపెన్ డేటా ఈ విషయాన్ని తెలిపింది. 2024లో మొత్తం 105,568 డ్రైవింగ్ లైసెన్స్‌లు మహిళలకు జారీ చేయగా.. పురుషులకు కేవలం 6,903 లైసెన్స్‌లు మాత్రమే జారీ అయ్యాయి. అధికారిక గణాంకాల ప్రకారం..2024 ఎమిరేట్ అంతటా మొత్తం 161,704 కొత్త డ్రైవింగ్ లైసెన్స్‌లు మహిళలకు జారీ చేశారు.
అబుదాబిలో గత సంవత్సరం సుమారు 147,334 కొత్త లైసెన్స్‌లు జారీ కాగా.. అందులో మేల్ డ్రైవర్లు 120,363 మంది కాగా, మహిళా డ్రైవర్లు 26,971 కొత్త లైసెన్స్‌లను పొందారు.
2024లో షార్జాలో 65,195 కొత్త లైసెన్సులు జారీ చేయగా. వాటిలో 15,653 మహిళలకు, 49,542 పురుషులకు మంజూరు అయ్యాయి.
రోడ్ సేఫ్టీ యూఏఈ డేటా ప్రకారం..యుఏఈలో రోడ్డు ప్రమాదాల్లో మహిళా డ్రైవర్లు సంఖ్య తక్కువగా ఉంది. మహిళలు సురక్షితమైన డ్రైవింగ్ పద్ధతులను పాటిస్తారని నివేదిక పేర్కొంది. దాంతోపాటు మహిళలు ట్రాఫిక్ చట్టాలను పాటిస్తారని, డ్రైవింగ్ చేసేటప్పుడు తక్కువ దూకుడు ప్రవర్తనలను కలిగి ఉంటారని నివేదిక తెలిపింది.
తాజా వార్తలు
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్
- పొంగల్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీ
- ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు
- ఖతార్ విజిటర్లలో 35% మంది గల్ఫ్ దేశాల వారే..!!
- సౌదీలో 89 నాన్ ప్రాఫిట్ సంస్థలపై విచారణ..!!
- దుబాయ్‌లో రియల్ మార్కెట్ మందగమనంలో ఉందా? నిజమెంత?
- నివాస ప్రాంతాలలో కొత్త ప్రైవేట్ స్కూళ్లకు అనుమతి లేదు..!!
- ఒమన్ లో మినిస్టర్స్, అఫిషియల్స్ ప్రమాణ స్వీకారం..!!
- ఆరు నెలల్లో 1,109 మందిపై బహిష్కరణ వేటు: బహ్రెయిన్
- హమద్ పోర్టులో ఆడియో స్పీకర్లలో షాబు..!!







