కార్మిక చట్ట ఉల్లంఘనలకు కొత్త జరిమానాలు.. మానవ వనరుల మంత్రిత్వ శాఖ ప్రతిపాదన..!!

- May 22, 2025 , by Maagulf
కార్మిక చట్ట ఉల్లంఘనలకు కొత్త జరిమానాలు.. మానవ వనరుల మంత్రిత్వ శాఖ ప్రతిపాదన..!!

రియాద్: కార్మిక చట్టం నిబంధనల ఉల్లంఘనలకు జరిమానాలను సవరణను మానవ వనరులు, సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది. ఈ మేరకు ఆ శాఖ మంత్రి అహ్మద్ అల్-రాజి నిర్ణయించారు. కొత్త ప్రతిపాదనలను అమలు చేయడానికి ముందు సంబంధిత వర్గాల అభిప్రాయాన్ని కోరారు. మంత్రిత్వ శాఖ ఇస్తిత్లా పబ్లిక్ సర్వే ప్లాట్‌ఫామ్‌లో ఉల్లంఘనలు, వాటి జరిమానాల జాబితాను ప్రచురించారు.

1- SR200,000 — SR250,000 లైసెన్స్ లేకుండా నియామకం, అవుట్‌సోర్సింగ్ లేదా కార్మిక సేవలను అందించడం వంటి కార్యకలాపాలను నిర్వహించడం.
2–SR200,000 లైసెన్స్ లేకుండా సౌదీలను నియమిస్తే. 
3- సౌదీయేతర కార్మికుడిని వర్క్ పర్మిట్ లేకుండా నియమిస్తే యజమానికి SR10,000. కార్మికుల సంఖ్య ఆధారంగా జరిమానాలు లెక్కిస్తారు.
4- SR2,000 —SR8,000 సౌదీయేతర కార్మికులను నియమించుకున్నందుకు లేదా చెల్లుబాటు అయ్యే ఉద్యోగ సంబంధం లేకుండా సౌదీయేతర కార్మికుడిని నమోదు చేసినందుకు యజమానికి విధిస్తారు.
5- SR10,000 — SR20,000 తన ఉద్యోగిని మూడవ పక్షం కోసం లేదా వారి స్వంత ఖాతా కోసం పని చేయడానికి అనుమతించే యజమానికి.
6- మరొక యజమాని కోసం పనిచేసే ఉద్యోగికి SR5000. 
7– SR1,500—SR5,000 వృత్తిపరమైన భద్రత, ఆరోగ్య నిబంధనలను పాటించడంలో విఫలమైతే యజమానికి.
8- ఎండలో లేదా ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో జాగ్రత్తలు తీసుకోకుండా కార్మికుడిని నియమింస్తే SR1,000.
9- SR1,000 — SR 3,000 అవసరమైన ఫీజులు, ఖర్చులను యజమాని భరించడంలో లేదా వాటిని కార్మికులకు బదిలీ చేయడంలో విఫలమైతే 
10- SR300 కార్మికుల వేతనాలు మరియు హక్కులను సకాలంలో చెల్లించడంలో విఫలమైతే లేదా కార్మికుల సంఖ్యతో గుణించబడే వేతనాలను నిలిపివేస్తే.
11- SR1000—SR3000 యజమాని ఏదైనా వివక్షత చర్యకు. ప్రవర్తనా ఉల్లంఘనలను పరిశోధించడానికి కమిటీని ఏర్పాటు చేయడంలో విఫలమైతే 
12- SR1000—SR3000 ఐదు రోజుల్లోపు దర్యాప్తు చేసి క్రమశిక్షణా చర్యను సిఫార్సు చేయడంలో విఫలమైతే లేదా 30 రోజుల్లోపు క్రమశిక్షణా చర్యను విధించడంలో విఫలమైతే 
13- 15 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలను నియమించినందుకు SR1,000 నుండి 2,000 వరకు ఫైన్.
14- కార్మికుడి పాస్‌పోర్ట్ లేదా నివాస అనుమతిని ఉంచుకున్నందుకు SR1,000.
15- SR3000—SR5000 పర్యవేక్షణకు కేటాయించబడిన సూపర్‌వైజర్లు మరియు ఉద్యోగుల పనులను సులభతరం చేయడంలో విఫలమైతే 
16- SR1,000—SR 3,000 ఉద్యోగ ఖాళీలను ప్రకటించడం మరియు ఇంటర్వ్యూలు నిర్వహించడం కోసం నిబంధనలను పాటించడంలో విఫలమైతే
17- SR1000 పని చేసే మహిళలకు ప్రసూతి సెలవులు అందించడంలో విఫలమైతే
18- SR500 సేవలను అందించడంలో విఫలమైతే మరియు వైకల్యాలున్న వ్యక్తులు తమ పనిని నిర్వహించడానికి వీలుగా ఏర్పాట్లు చేయడంలో విఫలమైతే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com