25 రూ.లకే రైలులో దేశం మొత్తం చుట్టెయొచ్చు..యువతకు మాత్రమే!
- May 22, 2025
భారతదేశం భిన్న సంస్కృతులకు.. ప్రకృతి అందాలకు..చారిత్రక ప్రదేశాలకు..ఆధ్యాత్మిక ప్రాంతాలకు నెలవు. అలాంటి దేశాన్ని చుట్టేయాలనే కోరిక ఎవరికి ఉండదు?అలాంటి వారి కోసం “జాగృతి యాత్ర” పేరుతో ప్రత్యేక రైలును కేంద్రం తీసుకువచ్చింది. 2008 నుంచి ఈ రైలు నడుస్తోంది. కానీ ఈ రైలు గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.
ఈ రైలు ప్రధాన ఉద్దేశ్యం వ్యాపారం ద్వారా భారతదేశ నిర్మాణం.ఈ రైలులో ప్రయాణించడం ద్వారా యువత పారిశ్రామికవేత్తలుగా మారడానికి అవసరమైన నైపుణ్యాలు..అలాగే స్ఫూర్తిని పొందవచ్చు. ఈ రైలు ప్రయాణంతో పాటు జ్ఞానాన్ని సైతం పెంచుకోవచ్చు.అయితే ఈ రైలులో ఎలా ప్రయాణించాలి.. టికెట్ బుకింగ్ ఎలా చేసుకోవాలి.. ఎంత ఖర్చవుతుందంటే..
ఏడాదికి ఒక్కసారి మాత్రమే..
ఈ రైలు ఏడాదికి ఒక్కసారి మాత్రమే నడుస్తుంది.ఈ రైలు ప్రయాణానికి 500 మంది ప్రయాణికులను మాత్రమే అనుమతిస్తారు.ఇక ఈ రైలు ప్రయాణంలో యువతకు పారిశ్రామికవేత్తలకు సంబంధించిన మెళకువలు నేర్పిస్తారు.కేవలం 15 రోజుల్లో ఈ రైలు సుమారు 8000 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది.
ఢిల్లీ నుండి ప్రారంభం..
ఈ రైలు ఢిల్లీ నుండి ప్రారంభమవుతుంది. మొదటి స్టాప్ అహ్మదాబాద్..ఆ తర్వాత ముంబై, బెంగళూరు మీదుగా మధురై చేరుకుంటుంది.అక్కడి నుండి ఒడిశాలోకి ప్రవేశించి.. మధ్య భారతదేశం ద్వారా తిరిగి ఢిల్లీకి చేరుకుంటుంది.ఈ రైలు ప్రయాణంలో అనేక తీర్థయాత్రా స్థలాలతోపాటు పర్యాటక ప్రదేశాలను సైతం సందర్శించే అవకాశం కల్పిస్తారు.
ఈ ఏడాది.. ఈ యాత్ర ఎప్పుడు? ఎలా నమోదు చేసుకోవాలి?
ఈ యాత్ర ప్రతి ఏడాది నవంబర్ నుంచి ప్రారంభమవుతుంది.అయితే అందుకోసం ముందుగానే పేరు నమోదు (రిజిస్ట్రేషన్) చేసుకోవాలి.ఈ రైలులో ప్రయాణించడానికి వయస్సు 21 నుండి 27 సంవత్సరాల మధ్య మాత్రమే ఉండాలి.ఈ ఏడాది ఈ యాత్ర నవంబర్ 7వ తేదీన ప్రారంభమై.. నవంబర్ 22వ తేదీతో ముగుస్తుంది.
ఇలా బుక్ చేసుకోవాలి..
సీటును బుక్ చేసుకోవడానికి https://www.jagritiyatra.com/అనే వెబ్‌సైట్‌ను సందర్శించి పేరు నమోదు చేసుకోవాల్సి ఉంది.ఈ రైలులో ప్రయాణించడానికి యువతను మల్టీ-లెవల్ సెలక్షన్ ప్రాసెస్ తర్వాతే ఎంపిక చేస్తారు.ఈ యాత్ర కోసం అక్టోబర్ 15వ తేదీ వరకు పేర్లు నమోదు చేసుకోవచ్చు.మీరు ఈ యాత్రకు సంబంధించిన నిబంధనలకు అర్హులు అయితే.. కేవలం రూ.25 మాత్రమే టికెట్ ధర చెల్లించాల్సి ఉంటుంది. అంటే జస్ట్ రూ.25తో భారతదేశం మొత్తం చుట్టేయవచ్చు!
తాజా వార్తలు
- దుబాయ్‌లోని ఈ మేజర్ ఆకర్షణలు సమ్మర్ లో మూసివేత..!!
- కువైట్ లో విమాన రాకపోకలలో గణనీయమైన వృద్ధి..!!
- అమ్మన్లో సౌదీ, జోర్డాన్ విదేశాంగ మంత్రుల భేటీ..!!
- రైతులకు ఒమన్ ఫ్లోర్ మిల్స్ గుడ్ న్యూస్..!!
- బహ్రెయిన్ లో ఇకపై ఇంగ్లిష్ లోనూ నోటరైజేషన్..!!
- యూఏఈలో ఎతిహాద్ రైల్ ప్రయాణికుల సేవలకు బుకింగ్‌లు ప్రారంభం..
- గ్రీన్‌కార్డ్ హోల్డర్లకు బిగ్‌షాక్..!
- సాయికృష్ణ కేసులో బిగ్ ట్విస్ట్..సీఐ నాగరాజు అరెస్ట్
- దుబాయ్‌లో అద్దెదారులకు ఊరట.. ‘ఫ్లెక్సీ రెంట్’ పథకం ప్రారంభం
- సెప్టెంబర్ 30న ఎతిహాద్ రైల్ ప్రయాణికుల సేవలకు శ్రీకారం







