కేటీఆర్ చొరవతో మలేసియా జైలు నుంచి విడుదల..
- May 22, 2025
హైదరాబాద్: మలేసియాలో జైలు పాలైన తెలంగాణ వాసులు..భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ చొరవతో విడుదలై బుధవారం హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఈ ప్రక్రియలో కీలకంగా వ్యవహరించిన ఖానాపూర్ భారాస నేత భూక్యా జాన్సన్‌నాయక్‌తో కలిసి బుధవారం నందినగర్‌లోని నివాసంలో కేటీఆర్‌ను బాధితులు, వారి కుటుంబసభ్యులు కలిశారు. ఈ సందర్భంగా భావోద్వేగానికి గురైన వారిని కేటీఆర్ అనునయించారు. అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కడెం మండలం లింగాపూర్, దస్తురాబాద్ మండలం మూన్యాల్కు చెందిన ఆరుగురు ఉపాధి కోసం గత సంవత్సరం మలేసియాకు వెళ్లారు. అక్కడ ఓ కేసులో అరెస్టయ్యారు. ఈ విషయం కేటీఆర్ దృష్టికి రావడంతో.. ఆయన తమ పార్టీ నేత జాన్సన్ నాయక్‌తో మాట్లాడి వారి విడుదలకు ప్రయత్నించాలని కోరారు. కేటీఆర్ సూచనతో మార్చిలో మలేసియా వెళ్లిన జాన్సన్.. జైల్లో ఉన్న లింగాపూర్ గ్రామానికి చెందిన రాచకొండ నరేశ్, తలారి భాస్కర్, గురుజాల శంకర్, రాజేశ్వర్, గుండా శ్రీనివాస్, మూన్యాల్ గ్రామానికి చెందిన యమునూరి రవీందర్‌ను కలిశారు.అక్రమ ఆయుధాల కేసులో అరెస్టయ్యారని తెలుసుకున్న జాన్సన్..సొంత నిధులతో స్థానిక న్యాయవాదులను నియమించి.. న్యాయపరమైన ప్రక్రియ వేగవంతంగా జరిగేలా చూశారు. మే 12న మలేసియాకు మళ్లీ వెళ్లి.. అక్కడి కోర్టు విధించిన జరిమానా చెల్లించి, వారిని స్వదేశానికి తీసుకొచ్చారు.
తాజా వార్తలు
- ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం..ఆరుగురు సజీవదహనం!
- తెలంగాణలో 4 రోజులు భారీ వర్షాల హెచ్చరిక
- ఫుజైరాలో విదేశీ మీడియా సంస్థ కోసం వీడియో షూట్..వ్యక్తి అరెస్టు..!!
- అక్రమ ఒబెసిటీ ఆపరేషన్స్..జెడ్డాలోని కేంద్రం సీజ్..!!
- Skytrax అవార్డులు, Expo నుండి వైదొలిగిన హమద్ ఎయిర్ పోర్ట్..!!
- ప్రాంతీయ పరిణామాలపై బహ్రెయిన్, జోర్డాన్ చర్చలు..!!
- ల్యాండ్ పోర్టుల ద్వారా నిరాటకంగా చేపల దిగుమతులు..!!
- వైమానిక దాడిలో ఇరాన్ భద్రతా చీఫ్ మృతి
- పర్యాటకులకు ఇష్టమైన ఈద్ విహార కేంద్రంగా ఒమన్..!!
- ప్రాంతీయ పరిణామాల పై యూఏఈ అధ్యక్షుడు, భారత ప్రధాని చర్చలు..!!









