కొండగట్టులో హనుమాన్ జయంతి వేడుకలు
- May 22, 2025
తెలంగాణ: హనుమాన్ జయంతి సందర్భంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు కు భక్తులు భారీగా తరలివచ్చారు.అంజన్నను దర్శించుకునేందుకు వర్షంలోనూ కాలినడకన భక్తులు చేరుకున్నారు. ఆంజనేయస్వామి మాలధారులు దీక్షా విరమణ చేస్తున్నారు. స్వామి వారిని దర్శించుకునేందుకు క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు. తెల్లవారుజామున కొండగట్టులో ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్ పరిశీలించారు. క్షేత్రస్థాయిలో తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు. క్యూలైన్లను కలెక్టర్ పరిశీలించారు.
శ్రీరామ నామస్మరణతో మార్మోగుతున్న అంజన్న క్షేత్రం
కొండగట్టు ఆంజనేయ ఆలయం కాషాయమైంది. జై శ్రీరాం, జై హనుమాన్ నామస్మరణతో మార్మోగుతోంది. హనుమాన్ పెద్ద జయంతి సందర్భంగా భక్తులు, మాలధారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అర్ధరాత్రి నుంచే స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు.
తాజా వార్తలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!







