దుబాయ్ బర్షాలో రెండో ఫైర్ యాక్సిడెంట్..
- May 23, 2025
దుబాయ్: దుబాయ్ బర్షాలో రెండో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. వరుస ప్రమాదాలతో ప్రజలు భయంతో వణికిపోయారు. గురువారం మధ్యాహ్నం అల్ బర్షా 1లోని ఒక రెస్టారెంట్‌లో చెలరేగిన మంటలను సకాలంలో ఫైర్ ఫైటర్స్ అదుపులోకి తెచ్చినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. "నేను నిద్రపోతున్నప్పుడు నా ఫ్లాట్ మేట్ నన్ను నిద్ర లేపి భవనంలో మంటలు చెలరేగుతున్నాయని చెప్పాడు. నేను లేచి చూసేసరికి జనం బయటకు పరుగెత్తుకుంటూ వస్తున్నట్లు చూశాను." అని ఒక అద్దెదారుడు చెప్పాడు. "నేను బయటకు అడుగు పెట్టినప్పుడు, దుబాయ్ సివిల్ డిఫెన్స్ సిబ్బంది మంటలను అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు చూశాను. జనాన్ని అదుపు చేయడానికి పోలీసులు కూడా ఉన్నారు.” అని తన అనుభవాన్ని వివరించారు.
ఇటీవల జరిగిన అగ్నిప్రమాదం జరిగిన ప్రదేశం నుండి దాదాపు 500 మీటర్ల దూరంలో ఈ సంఘటన జరిగింది. మే 13న, మాల్ ఆఫ్ ది ఎమిరేట్స్ సమీపంలోని బర్షా 1లోని హలీమ్ స్ట్రీట్‌లోని అల్ జరూని భవనంలో మంటలు చెలరేగాయి . ఆ మంటలు కూడా 13 అంతస్తుల భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న రెస్టారెంట్ నుండే వచ్చాయి. వరుస ఫైర్ యాక్సిడెంట్ లు ఆందోళన కలిగిస్తుందని ప్రజలు చెబుతున్నారు.
తాజా వార్తలు
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!







