సౌదీలో కమర్షియల్ రిజిస్ట్రేషన్ ఓనర్ డేటా అప్డేట్ కు అవకాశం..!!

- May 23, 2025 , by Maagulf
సౌదీలో కమర్షియల్ రిజిస్ట్రేషన్ ఓనర్ డేటా అప్డేట్ కు అవకాశం..!!

రియాద్: కమర్షియల్ రిజిస్ట్రేషన్ ఓనర్ డేటాను ఎలక్ట్రానిక్‌గా అప్డేట్ వల్ల సౌదీ సెంటర్ ఫర్ ఎకనామిక్ భాగస్వామ్యంతో వ్యాపార రంగానికి మంత్రిత్వ శాఖ అందించే అన్ని ఎలక్ట్రానిక్ సేవలను యాక్సెస్ చేయడానికి వీలు కల్పిస్తుందని వాణిజ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అయితే, వాణిజ్య రిజిస్ట్రేషన్‌ను అప్డేట్ విధానాలను పూర్తి చేయడానికి కొన్ని నిబంధనలు, షరతులు ఉన్నాయని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దరఖాస్తుదారుడి వయస్సు 18 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి. ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగుల డాటా అప్డేట్ సాధ్యం కాదు. ఈ సర్వీసు ఎలక్ట్రానిక్‌గా ఉచితంగా అందించబడుతుందని, "వ్యాపార వేదిక" ద్వారా ఒక రోజులోపు పూర్తవుతుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. మరిన్ని వివరాలకు వెబ్సైట్ (https://business.sa/)చూడాలని కోరారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com