హార్ట్ ఐలాండ్ - హనీమూన్ డెస్టినేషన్
- July 11, 2016
హృదయం ఆకారంలో రూపొందిన దుబాయ్‌లోని వరల్డ్ ఐలాండ్స్‌లోని సెంట్ పీటర్స్ బర్గ్ ఐలాండ్ (ది హార్ట్ ఆఫ్ యూరోప్‌లో భాగం) హనీమూన్ రిసార్ట్ తరహాలో అభివృద్ధి చేయబడ్తోందని ప్రాజెక్ట్ డెవలపర్ క్లెండీన్స్‌ట్ చెప్పారు. మాల్దీవ్స్, బోరా బోరా మరియు కరీబియన్ దీవుల్లోని హనీమూన్ స్పాట్స్ తరహాలో ఈ హార్ట్ ఐలాండ్‌ని తీర్చిదిద్దనున్నారు. 2015 నవంబర్‌లో ఈ ఐలాండ్‌ని హృదయం ఆకారంలో మార్చేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ ఐలాండ్‌లో 90 ఫ్లోటింగ్ సీ హార్స్ విల్లాస్ (అండర్ వాటర్ విల్లా) ఉంటాయి. ఇవన్నీ ఫ్లోటింగ్ జెట్టీలతో కనెక్ట్ చేయబడి ఉంటాయి. దుబాయ్ తీరం నుంచి 6.5 కిలోమీటర్ల దూరంలో, కేవలం 20 నిమిషాల ప్రయాణంతోనే ఈ దీవుల్ని చేరుకోవచ్చు. కొత్తగా పెళ్ళి చేసుకునేవారికి ఈ సెంట్ పీటర్స్ బర్గ్ ఐలాండ్ డ్రీమ్ డెస్టినేషన్ అవుతుందనీ, ఫైవ్‌స్టార్ సౌకర్యాలతో ఏర్పాటు చేసే రిసార్ట్ ప్రైవసీతోపాటు, ఫస్ట్ క్లాస్ హాస్పిటాలిటీ సర్వీసులతో ఆహూతుల్ని అలరిస్తుందని డెవలపర్ జోసెఫ్ క్లెండీన్స్‌డ్ చెప్పారు. హెలికాప్టర్లు, సీప్లేన్స్ లేదా బోట్స్ ద్వారా అతిథులు ఈ దీవికి చేరుకోవడానికి అవకాశముంది. అతి త్వరలో హనీమూన్ బుకింగ్స్ ప్రారంభమవుతాయి.
తాజా వార్తలు
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్‌లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!







