90 శాతం రెస్టారెంట్స్‌కి 'టూరిజం' గుర్తింపు
- July 11, 2016
బహ్రెయిన్‌లోని 90 రెస్టారెంట్లకు టూరిజం రెస్టారెంట్స్ అనే గౌరవం దక్కనుంది. ఎంపిక చేయబడ్డ రెస్టారెంట్స్‌లో సాధారణ రెస్టారెంట్లకు భిన్నంగా అతిథులకు మెరుగైన సౌకర్యాలు అందనున్నాయి. బహ్రెయిన్ టూరిజం అండ్ ఎగ్జిబిషన్స్ అథారిటీ (బిటిఇఓ) ఈ టూరిజం రెస్టారెంట్స్‌ని అతిథులకు పరిచయం చేసేందుకు పలు కార్యక్రమాలు చేపడుతోంది. 1986 చట్టం 15 ప్రకారం రూపొందించబడ్డ నిబంధనలకు అనుగుణంగా అనుమతులు పొందిన, సౌకర్యాలు కలిగిన రెస్టారెంట్లు పర్మిషన్స్ పొందగలరనీ, వినియోగదారులు ఇక్కడ చెల్లించే రుసుములన్నీ చట్టబద్ధంగానే ఉంటాయని డైరెక్టర్ హేషమ్ అల్ సకెన్ చెప్పారు. ఇంకో వైపున నాన్ టూరిజం రెస్టారెంట్స్ సర్వీసు ఛార్జిలను అదనంగా పొందేందుకు వీలు లేకుండా బ్యాన్ విధించారు. నిబంధనల్ని ఉల్లంఘించే రెస్టారెంట్లపై 10,000 దిర్హామ్‌ల వరకు జరీమానా విధించే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్‌లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!







