ఆపరేషన్ సిందూర్ విషయంలో మోదీకి రాహుల్ గాంధీ ప్రశ్నలు
- May 23, 2025
న్యూ ఢిల్లీ: ఆపరేషన్ సిందూర్ విషయంలో ఇటీవల అనేక ప్రశ్నలు, అనుమానాలను లేవనెత్తుతున్న కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ.. మరోసారి ప్రధాని మోదీ, కేంద్రమంత్రి జైశంకర్ లక్ష్యంగా తీవ్ర విమర్శలు, ప్రశ్నలు సంధించారు. ఆపరేషన్ సిందూర్‌ను నిలిపివేయడానికి అంగీకరించడంతో భారత ప్రతిష్ట విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజీపడ్డారని ఆరోపించారు. అదే సమయంలో ప్రధాని మోదీ మాట్లాడిన వీడియోను ఎక్స్‌లో షేర్ చేసిన రాహుల్ గాంధీ.. కెమెరాల ముందు మాత్రమే ప్రధాని మోదీ రక్తం ఎందుకు మరుగుతుందని ప్రశ్నించారు. అదే సమయంలో భారత విదేశాంగ విధానం పూర్తిగా కుప్పకూలిపోయిందని ఆరోపించారు. అదే సమయంలో భారత్-పాకిస్తాన్ మధ్య మధ్యవర్తిత్వం వహించమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ఎవరు అడిగారని నిలదీశారు.
తాజా వార్తలు
- అమెరికాలో నలుగురు భారత సంతతి వ్యక్తుల హత్య
- కువైట్ లో ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు
- బహ్రెయిన్ లో రోడ్డు ప్రమాదం..చిన్నారి సహా ముగ్గురు మృతి..!!
- చలి కుంపట్ల పై కువైట్ ఫైర్ ఫోర్స్ వార్నింగ్..!!
- గ్లోబల్ ఫాస్టెస్ట్ మొబైల్ ఇంటర్నెట్ సిటీగా దోహా..!!
- సౌదీయేతరుల కోసం 170 జోన్లు కేటాయింపు..!!
- దుబాయ్‌లో ట్రక్ డీజిల్ చోరీ..ఇద్దరు వ్యక్తులకు జైలుశిక్ష..!!
- ఒమన్ లో ఇండియన్ వెస్ట్రన్ నావల్ కమాండ్ కమాండర్..!!
- NRI టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో నారా లోకేష్ జన్మదిన వేడుకలు
- Google 2026 Internship:యువత కోసం గోల్డెన్ ఛాన్స్







